• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Seetha Rasina Ramayanam

Seetha Rasina Ramayanam By Sampreeth Shivaiah Neeli

₹ 220

అవతారిక

ప్రపంచంలో మూడు వందల రామాయణాలు ఉన్నాయంటారు.

ప్రతి కథ ఓ కొత్త తీరం, ప్రతి తీరం ఓ కొత్త రూపం.

అది-

వాల్మీకి రామాయణంలో ధర్మానికి పునాది వేసింది,

ఆధ్యాత్మక రామాయణంలో భక్తికి ఊపిరి పోసింది.

ఆనంద రామాయణంలో మనం ఎరుగని కథల నిధిగా మారింది,

అద్భుత రామాయణంలో రావణుడిని సంహరించిన దేవతగా సీతను చూపింది.

తమిళ నేలపై కంబ రామాయణం ప్రేమకావ్యమైతే,

ఉత్తరాన తులసీదాసుడి రామచరితమానస్ భక్తి ఉద్యమమైంది,

తెలుగులో రంగనాథ రామాయణం కథాప్రవాహమైతే,

మొల్ల రామాయణం ఒక స్త్రీ గొంతులో తేనెలొలికింది,

బెంగాల్లో కృత్తివాసి రామాయణం అక్కడి సంస్కృతిలో భాగమైంది.

కొన్నిచోట్ల కథ దారి తప్పింది...

కాదు, కొత్త దారి తొక్కింది.

జైనుల పౌమచరియంలో రావణుడ్ని చంపింది లక్ష్మణుడైంది;

బౌద్ధుల దశరథ జాతక కథలో సీతాపహరణమే లేని

శాంతి పర్వమైంది.

ఈ ప్రవాహం సరిహద్దులు దాటినప్పుడు..

రామకియన్ గా థాయ్లాండ్ జాతీయ గాథగా మారింది, రియమ్కర్గా

కంబోడియా శిల్పమై నిలిచింది.

హికాయత్ సేరి రామగా మలేషియాలో కొత్త మతంలోకి

ఇండోనేషియాలో కకావిన్,

మయన్మార్ లో యమ జట్టా, లావోస్లో ఫ్రా లక్ ఫ్రా లామ్...........................

  • Title :Seetha Rasina Ramayanam
  • Author :Sampreeth Shivaiah Neeli
  • Publisher :Vidmahi Publications
  • ISBN :MANIMN6633
  • Binding :Papar Back
  • Published Date :Nov, 2025
  • Number Of Pages :158
  • Language :Telugu
  • Availability :instock