మిథిల, విదేహ రాజ్యం... భారతదేశం “మిథిలలో బాల్యం”
నేను ‘మిథిల’ అని పిలవబడే ప్రాచీన విదేహ రాజ్యంలో పేదబ్రాహ్మణ (పూజారుల) కుటుంబంలో జన్మించాను.
అనేక తరాలకు ముందే దురదృష్టం మమ్మల్ని వెన్నాడి మేము 'జనకమహారాజు' కుటుంబంలో పరిచారకులుగా ఉన్నాము. నా తండ్రి | మహారాజు 'హ్రసవ రోమ జనక', ఆ తరువాత ప్రసిద్ధి పొందిన 'సీరధ్వజ జనకు'ల పరివారంలో పరిచారకునిగా ఉండేవాడు. ఆయన తండ్రి, తాత కూడా వారి పరివారంలోనే అలాగే ఉండేవారు. అందువలన మా తండ్రి | దగ్గరకు వచ్చేసరికి రాజప్రసాదంలో మా కుటుంబానికి ఒకానొక గౌరవ నీయమైన స్థానం ఉండి మిగిలిన పరిచారకులు, సహాయకుల నుండి | గౌరవాదరాలు అధికంగా పొందేవాళ్ళం.
నా తండ్రి మనస్సు, శరీరం పూర్తిగా మహారాజుకూ ఆయన కుటుంబానికే అంకితమై ఉండేవి. నా బాల్యం నుంచి జీవితంలో మా పాత్ర గురించి నాకు వున్న అవగాహన అది. మహారాజు అవసరాలు తీర్చడం కోసం చేయవలసిన ఏ పనైనా నా తండ్రికి తక్కువదిగా అనిపించేది కాదు. నాకు మా అమ్మ జ్ఞాపకం లేదు. ఆమె నా బాల్యంలోనే చనిపోయింది. మా కుటుంబంలో... నేను మా నాన్న... మాత్రమే ఉండేవాళ్ళం. అనేక మంది పరిచారకులు బాల్యంలో నాపట్ల శ్రద్ధ వహించినా ఆయన తన..............