చెదరగూడని స్వప్నాలు
కొన్ని కలలు కలలుగా ఉంటేనే బావుంటుంది.
కొన్ని పరిచయాలు, కొన్ని కొన్ని అనుభూతులు, కొన్ని ప్రదేశాలు, కొన్ని కొన్ని అనుభవాలు మనమీద అప్రయత్నంగా మత్తుమందు జల్లి, వశీకరించుకొని మనసులో గాఢ ముద్ర వేస్తాయి. తెలిసీ తెలియని ఆనందం, వ్యక్తావ్యక్తమైన అనుభూతీ ఆయా విషయాలతోనూ, సంఘటనలతోనూ ముడివడి మనల్ని అదోలాటి ట్రాన్స్కి శాశ్వతంగా పంపేస్తాయి. గుర్తొచ్చినప్పుడల్లా మధురమైన బాధకూ, అవ్యాజమైన ఆప్యాయతకూ అంతులేని ఆనందానికీ కారణభూత మవుతాయి. అలాంటి కలలు కలలుగా ఉంటేనే అందం!
దాదాపు ఇరవయ్యేళ్ల క్రిందటి సంగతి. కాకినాడలో ఇంజనీరింగు చదువుతున్న రోజులు. టీనేజీ దశ అప్పుడే దాటి, పెద్దాళ్లమయిపోయాం,' అని ఫీలైపోతున్న రోజులు.
హాస్టలు జీవితం....
స్వేచ్ఛ....
స్వతంత్ర భావాలు....................