కమ్యూనిస్ట్ భార్య
భార్యలందరిలోకీ పతివ్రతా శిరోమణి ఎవరూ అంటే కమ్యూనిస్ట్ భార్యేనని కొడవటిగంటి కుటుంబరావు ఎందుకు చెప్పలేదో ఆమెకు అర్థంకావడం లేదు. పురాణాల్లోని ధర్మపత్నులకు కమ్యూనిస్ట్ భార్యలు ఏమాత్రం తీసిపోరన్నది ఆమె అనుభవం మీద తెలుసుకున్న సత్యం. సత్యం గురించి ఎంతోమంది ఏదేదో చెప్పొచ్చు. కానీ, అనుభవ పూర్వకమైన సత్యం నిలువునా దహించేస్తుంది. అదిగో అలాంటి మంటల తీవ్రతలోనే ఉందామె.
అలా జ్వలించిపోతూ.. ఆలోచనలతో రగిలిపోతూ.. సోఫాలో కూలబడిన భార్యను చూసి
“కాఫీ తాగుదామా” అని అడిగాడు భర్త.
"అంటే, నేను కలపాలా?”
"కాదు.."
"ఏంటి కాదు? కాఫీ ఏమైనా విషమా? తాగితే సచ్చిపోతామా? పోనీ ఇప్పుడే తాగామా? మళ్లీ తాగుతానా అని సందేహపడటానికి?"అంది రుసరుసగా.
ఆ రుసరుసలన్నీ మామూలే కాబట్టి అతను నిశ్శబ్దంగా వంటింట్లోకి వెళ్లిపోయాడు.
ఆమెకు ఇందాకటి సంఘటనే గుర్తుకు వస్తోంది. వెళ్లక, వెళ్లక ఎన్నో రోజుల తర్వాత.. రోజులేమిటిలే ఏళ్లే గడిచిపోయాయి. స్నేహితురాలింటికి వెళ్లింది. గతంలో ఆమె పార్టీ మహిళా విభాగంలో పనిచేసేప్పుడు పరిచయం. ప్రదర్శనల్లో పాల్గొనడంలో, నినాదాలు ఇవ్వడంలో.. ఆమె దూకుడుగా ఉండేది. దానికి ఆకర్షితులై అప్పుడప్పుడే.............