• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Shanyora

Shanyora By Mudha Suresh

₹ 250

శాన్యోరా

అది మిలటరీ సెంట్రల్ జైల్ !
డెహరాడూన్ పొలిమేరల్లో నిర్మించబడ్డ రాతి కట్టడం- జైలు
గోడలు ఇరవై అడుగులు పైగా ఎత్తు వుంటాయి.
గోడల మందం నాలుగడుగులు.

గోడల కావలివైపు ఏడడుగుల దూరం పరుచుకున్న కందకాలు! కందకపు టంచుల పొడవునా కంటికి కనిపించని అతి సన్నని రాగి తీగల ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వుంటుంది........

సెల్లో వెల్లకిలా పడుకుని ఆలోచిస్తున్నాను.

ఆరు నెలలయింది - దగ్గరగా జరిగిపోయినట్లున్న ఆ నాలుగు గోడల మధ్య నేను ప్రవేశించి.

ఎంత గౌరవంగా బ్రతికే వాడిని ఆర్నెల్ల క్రితం ! ఇప్పుడూ బ్రతుకుతున్నాను.

తేడా

ఇన్నాళ్ళూ బ్రతకడానికి మాత్రమే తినేవాడిని.

ఇప్పుడు తినడానికి మాత్రమే బ్రతుకుతున్నాను జైలులో. జీవితంమీద రోత పుడుతోంది.....

అలవాటుగా మీసాలను మునివేళ్ళతో స్పర్శిస్తూ, ఆలోచిస్తున్నాను.

ఎందుకు చేశానా దగుల్బాజీ పని ?

ఆ సంఘటన జ్ఞాపకం వస్తోంది.

ఒళ్ళంతా చెమటలు పట్టసాగింది.

ఏదో బలహీనత నన్ను ఆవరిస్తోంది.

తోడు ఎవరూ లేరు. కష్టం చెప్పుకుని, గుండె బరువు దించుకోవడానికి.

సెల్కి ఒక్కడే.

పగలు, రాత్రి గదిలో ఒంటరిగా

మూసుకున్నాను.

గణగణ గంట ఎక్కడో మ్రోగింది.

భయంకరమైన ఒంటరితనంలో - కళ్ళు..............

  • Title :Shanyora
  • Author :Mudha Suresh
  • Publisher :Classic Books
  • ISBN :MANIMN4595
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :264
  • Language :Telugu
  • Availability :instock