• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Shatadika Sadguru Sikharalu

Shatadika Sadguru Sikharalu By Smt Katravulapalli Subbalakshmi

₹ 450

స్వామి చిన్మయానంద

 

"హిందువులను హిందుత్వానికి కన్వర్ట్ చేయడమే నా మిషన్" అని చెప్పిన చిన్మయా మిషన్ వ్యవస్థాపకులు స్వామి చిన్మయానంద విద్యాధికుడు, సంస్కారవంతుడు, మేధావి. అయిన చిన్మయానంద పరమార్థాన్ని గ్రహించాలనే దృఢ దీక్షతో శ్రీ శివానంద సరస్వతిని భక్తిశ్రద్ధలతో సేవించి, వారి వాత్సల్యానుగ్రహాలతో బ్రహ్మవిద్యాసారాన్ని అనుభవం పొంది, బ్రహ్మవిదులై, మానవాళికి మహావరంగా విశ్వవిఖ్యాతులయ్యారు. సాధన సఫలం కావడానికి సాధకునికి ఉండవలసిన తపన, దీక్ష, దృక్పథం, పరిస్థితులను వీక్షించే విధానం మొదలైన వాటిని చక్కగా వివరించారు.

పదిహేడో శతాబ్దం ప్రారంభంలో డచ్, పోర్చుగల్, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్ వంటి ఐరోపా దేశాల నుండి వర్తక వ్యాపారాల నిమిత్తమై అక్కడి వ్యాపారులు మన భారతదేశంలో ప్రవేశించారు. వీళ్లలో బ్రిటిష్ జాతి వారు మాత్రం కేవలం వర్తక వ్యాపారాలతో తృప్తి పడకుండా అటు ముస్లిం పాలకులకు, ఇటు హిందూ రాజులకు మధ్య విభేదాలు సృష్టించి, విభజించి పాలించే వ్యూహంతో పావులు కదిపి, స్థావరాలను ఏర్పరచుకున్నారు. దీనితో భారత ఆర్థిక, సాంస్కృతిక, నాగరిక పరిస్థితుల్లో పెను పరిణామాలు సంభవించాయి. బ్రిటిష్ వారు తమ దేశాన్ని విడిచి, దూరంగా ఉన్న మనవద్దకు వచ్చారు. అయినా తమ ఆలోచనా విధానాన్ని, జాతి వివక్షను, తమ మత సంప్రదాయాలనూ విడవలేదు.

స్వాతంత్ర్యోద్యమ ఉద్రిక్తతల మధ్య లక్నో యూనివర్సిటీ నుంచి సగం చదువులోనే బయటకు వచ్చాడు బాలకృష్ణ మీనన్ అనే నవ యువకుడు. ఎంతో ఉద్విగ్నత పొంది, భారత సోషలిస్టు పార్టీ సిద్ధాంతాలకు ప్రేరితుడై స్వతంత్ర సమరంలోకి దూకాడు............

  • Title :Shatadika Sadguru Sikharalu
  • Author :Smt Katravulapalli Subbalakshmi
  • Publisher :Bhagavan Publications Hyd
  • ISBN :MANIMN5018
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :455
  • Language :Telugu
  • Availability :instock