రాజు-రైతు
శిక్లంగేరి రాజైన కళాధరుడికి ప్రకృతి సౌందర్యమంటే ప్రాణం. ఆయన రోజూ ఎక్కడెక్కడికో వెళ్ళి అక్కడి ప్రకృతిరామణీయాన్ని చూస్తూ ఆనందించడమే కాక ప్రకృతి సౌందర్యాన్ని చిత్రకారుల చేత చిత్రింపచేసి ఆ చిత్రపటాలతో రాజభవనాన్ని అలంకరించేవాడు.
ప్రకృతి సౌందర్యపు మత్తులోపడి కళాధరుడు రాజ్యంలోని బీద ప్రజల బాగోగుల గురించి పూర్తిగా పట్టించుకోవటం మానేశాడు. ఇది మంత్రికి ఎంతో బాధగా ఉండేది కానీ రాజునేమి అనలేక అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.
ఒక రోజున చిత్రకారుడొకడు విచిత్ర చిత్ర పటాన్ని గీసి రాజుకు సమర్పించాడు. ఆ చిత్ర పటంలోని రంగులు సహజత్వానికి దగ్గరగానూ, అద్భుతంగానూ ఉన్నాయి. అందులో రాజు ప్రకృతి సౌందర్యంతో నిండిన ప్రదేశంలో కూర్చుని నవ్వుతూ ఆనందిస్తున్నట్లు చిత్రీకరించబడింది. రాజు ముఖం దివ్యతేజస్సుతో వెలిగిపోతోంది. ఆయన ముందర ఒక బయలు ప్రదేశం. ఎదురుగా ఒక కొండ. కొండ ప్రక్క కోనేరు, కొండపైన ఆకాశంలో పున్నమి చంద్రుడు, కొండప్రక్క కోనేటిలో చంద్రుడి ప్రతిబింబం. నేల నిండా వెన్నెల పరుచుకుని ఉంది...........