ఈ పుస్తకాన్ని ఎలా రాశాను - ఎందుకు రాశాను?
ఇరవైయవ శతాబ్దంలో మొదటి ముప్ఫైఐదు సంవత్సరాలలో, అమెరికాలోని ప్రచురణ సంస్థలు వివిధ విషయాలపై రెండు లక్షలకు పైగా పుస్తకాలని ప్రచురించాయి. వాటిలో చాలా మటుకు ఏ మాత్రం ఆసక్తికరంగా లేవు, చాలా పుస్తకాలు డబ్బు చేసుకోలేకపోయాయి. 'చాలా' అన్నానా? ప్రపంచంలోని అతి పెద్ద ప్రచురణలో అతనికి డెబ్భైఐదేళ్ల అనుభవం ఉన్నప్పటికీ, తన కంపెనీ ప్రచురించిన ఎనిమిది పుస్తకాలలో ఏడింటిపైన నష్టపోతోందని, నాతో చెప్పాడు.
మరయితే నేను ఇంకో పుస్తకం రాయటం అనే తొందరపాటు పనెందుకు చేశాము? పోనీ, నేను రాశానే అనుకుందాం, మీరెందుకు కష్టపడి దాన్ని చదవటం?
రెండూ అర్థమున్న ప్రశ్నలే. నేను వాటికి సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తాను. నేను 1912 నించీ, న్యూయార్క్ లో, వ్యాపార, వృత్తి రంగాల్లో పనిచేసే మగవారికోసం, ఆడవాళ్లకోసం కొన్ని కోర్సులు నడుపుతున్నాను. మొదట్లో నేను బహిరంగా ఉపన్యాసా లివ్వటంలో మాత్రమే కోర్సులు నడిపేవాణ్ణి. ఆ కోర్సులు పెద్దవాళ్లకి శిక్షణ ఇవ్వటానికి తయారు చేయబడినవి. నిజజీవితంలో, వాళ్లు నలుగురిముందు ధైర్యంగా నిలబడి, తమ ఆలోచనలని మరింత స్పష్టంగా తెలియజేయటానికీ, బిజినెస్ ఇంటర్వ్యూలలోనూ, నలుగురూ కలిసి చర్చించుకునేటప్పుడూ ఇంకా చక్కగా, పొందిగ్గా తమ అభిప్రాయాలని వ్యక్తం చేయగలగటానికీ పనికి వచ్చే కోర్సులవి.
కానీ క్రమక్రమంగా, సమయం గడిచిన కొద్దీ, ఎంత అవసరమైనప్పటికీ, వీళ్లకి చక్కగా మాట్లాడటం ఒక్కటే నేర్పితే సరిపోదనీ, రోజువారీ జీవితంలోనూ, సాంఘిక సంబంధాలలోనూ, ఎదుటివారితో ఎలా వ్యవహరించాలనే నేర్పుకూడా వీళ్లకి శిక్షణ ద్వారా అందజేయటం ఎంతో అవసరమని నేను గ్రహించాను.
అంతేకాదు, ఈ క్రమంలో, నాకు కూడా ఇటువంటి శిక్షణ అవసరమని నేను అర్ధం చేసుకున్నాను. వెనక్కి తిరిగి నా జీవితాన్ని చూసుకుంటే, విచక్షణాజ్ఞానం, ఇతరులని అర్ధం చేసుకునే సామర్థ్యం నాలో చాలా సందర్భాల్లో లోపించాయని నాకు అనిపించి, నిర్ఘాంతపోయాను. ఇరవై ఏళ్ల క్రితం నాకెవరైనా ఇలాటి పుస్తకం చదవటానికి ఇచ్చి ఉ దండకూడదా, అని అనిపిస్తోంది! అది నాకు విలువకట్టలేని గొప్ప వరం అయి ఉండేది.
ఒక వ్యక్తి ఎదుర్కొనే అతి పెద్ద సమస్య, ఎదుటి వారితో ఎలా వ్యవహరించాలనేదే ముఖ్యంగా మీరు వ్యాపార రంగంలో ఉన్నట్టయితే ఇది మరీ పెద్ద సమస్య అనాలి. కానీ, మీరు ఒక గృహిణి అయినా, వాస్తుశిల్పి అయినా, ఇంజనీరయినా, మీకీ సమస్య ఎదురు..................