మెగాభినందన
వ్యక్తి శక్తిగా, వ్యవస్థగా ఎదిగే పరిణామక్రమానికి అక్షర
రూపం ఇస్తే అది చరిత్ర అవుతుంది... భావితరాలకు ఉపయుక్తం అవుతుంది. అలా అక్షర రూపంలో నిక్షిప్తమైన చరిత్రకు శాశ్వతత్వం ఉంటుంది. అందుకే సమాజంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత చరిత్రలకు అక్షర రూపాన్నిచ్చి శాశ్వతత్వాన్ని కల్పించే బాధ్యతను స్వీకరిస్తారు కొందరు చరిత్రకారులు, జర్నలిస్టులు.
అలాంటి బాధ్యతను స్వీకరించి బాధ్యతాయుతంగా 50 మందికి పైగా సినీ ప్రముఖుల తొలి అడుగులను, వారి సుదీర్ఘ జీవిత ప్రస్థానాలను ఆసక్తిదాయకంగా అక్షర చేశారు సీనియర్ జర్నలిస్ట్ ప్రభు.
2006 నుండి 2010 వరకు ఐదు సంవత్సరాల పాటు "తెలుగు ఫిలిం ట్రేడ్ గైడ్" పత్రిక మరియు "సినీ గోయర్ డాట్ కామ్" అనే వెబ్సైట్ కోసం ప్రభు చేసిన ఇంటర్వ్యూలు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించాయి. అప్పట్లో ప్రతి వారం క్రమం తప్పకుండా వచ్చే ప్రభు ఇంటర్వ్యూలు, రివ్యూల కోసం సినీ ప్రముఖులు సైతం ఎదురు చూసేవారు అనటంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. ప్రముఖుల జీవిత చరిత్రలను వారి మాటల్లోనే కళ్లకు కట్టినట్లుగా 'ఫస్ట్ పర్సన్'లో ఆటో బయోగ్రఫికల్ స్టయిల్ లో రాయడం ఒక అరుదైన ప్రక్రియ. అందువల్ల నేరుగా ఆయా ప్రముఖులతోనే మాట్లాడిన అనుభూతి కలుగుతుంది. ఇందులో మరో అభినందనీయమైన కోణం ఏమిటంటే గొప్ప విజయాలతో శిఖరాగ్రాలకు చేరిన సుప్రసిద్ధుల చరిత్రలే కాకుండా సినిమా కోసం సర్వశక్తులు ఒడ్డి ఓడిన పరాజిత విజేతల జీవితాలను కూడా ప్రభు అర్థవంతంగా స్పృశించారు.
సినిమా అనే రంగుల ప్రపంచంలో అద్భుత విజయాలతో విజేతలుగా నిలిచిన....................