ముందు మాట
చదవాల్సిన జీవితం
కామ్రేడ్ సీతారాం ఏచూరి ఎదిగిన తీరు, నిర్వహించిన పాత్ర గురించి ఇపుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక విప్లవకారుడు ఈ దేశంలో రూపొందే విధానం మనకర్థమవుతుంది. ఏచూరి మేధోసంపత్తి, లెనినిస్టు ఆచరణ, సామాజిక, ఉద్యమ అధ్యయనం ఎంతో ప్రత్యేకమయినవి. అంతేకాదు, ఒక మానవీయ వ్యక్తిత్వం, నాయకుడుగా ఉండాల్సిన నైపుణ్యాలు, ప్రేమ, స్నేహశీలత వీటితో పాటుగా అచంచలమైన సానుకూల దృక్పథం ఆయన ప్రత్యేకతలు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని, తాత్విక ఆలోచనను, రాజకీయ విధానాన్ని ఆచరణలోకి తీసుకురావటంలో అనుసరించే సృజనాత్మక పద్ధతి, మొదలైన విషయాలు ప్రతి ఉద్యమ నాయకుడు, కార్యకర్త తెలుసుకోవలసిన, అధ్యయనం చేయాల్సిన విషయం.
ఏచూరి కన్నుమూసిన తర్వాత, అతడు లేని లోటు ఎంత పెద్దదో స్పష్టంగా తెలుస్తున్నది. అది పూడ్చలేని విధంగా ఉందన్నది వాస్తవం. ఆ నష్టం ఆయన కొనసాగిన పార్టీకే కాదు, దేశంలోని వామపక్ష ప్రజాతంత్ర శక్తులకు, దేశ ప్రజలకూ కూడా అపారమైనదనే విషయం అర్థమవుతున్నది. ఈ లోటును పూడ్చుకోవటం కష్టమైనప్పటికీ ఆ ప్రయత్నం చేయడం అవసరం. ఎందుకంటే సమాజ గమనాల మూలసూత్రాలు ప్రపంచానికంతటికీ ఒక్కటిగానే ఉంటాయి. అవి సిద్ధాంత రూపంలో మనకున్నాయి. కానీ వాటిని ఒక నిర్దిష్ట సమాజంలో నిర్ధిష్టంగా విశ్లేషించి, ఇక్కడి చరిత్ర, సంస్కృతి అనుసరించి ఆచరణకు సృజనాత్మకంగా సిద్ధాంతాన్ని అన్వయించపూనుకోవడం అత్యంత ఆవశ్యకమయిన పని. దానికి నిలువెత్తు నిదర్శనం సీతారాం ఏచూరి. అందుకనే ఏచూరి. .........................