సిద్ధాంత శిరోమణి గ్రంథము గూర్చి సంక్షిప్త పరిచయం
శ్రీ|| శ || 12వ శతాబ్దంలో భాస్కరాచార్యునిచే రచించబడిన అమోఘ గ్రంథము సిద్ధాంత శిరోమణి. ఈ గ్రంథమునాలు విభాగములుగా రచించబడింది. వ్యక్త గణితము (arithmatics and mensuration'లీలావతీ గణితము పేరుతో), అవ్యక్త గణితము (బీజ గణితము. algebra), గోళాధ్యాయము. గణితాధ్యాయము. చివరి రెండు భాగములు గణితజ్యోతిష్యానికి సంబంధించినవి.
మొదటి రెండు గణిత గ్రంథముల విషయము మిగతా రెండు గ్రంధములగణితానికి ఉపయోగించారు.
గణిత జ్యోతిషము లగద మహామునిచే ప్రవచించబడిన వేదాంగ జ్యోతిషముతో ఆరంభించి, సంహితా కాలములలో బ్రహ్మ వాసిష్ఠ గర్వ మరియు అనేక మునుల ద్వారా పారంపరికముగా పరివర్తనము చేయబడి జ్ఞానకోశము రక్షింపబడింది. కాలక్రమేణా సిద్ధాంత కాలమప్పటికి అభివృద్ధి చెందిన గ్రహ గణితముతో ఉన్నతమైన గ్రంథములు రచించారు. వీటిలో అదిమమైనది సూర్యసిద్ధాంతము. సూర్య సిద్ధాంతము యొక్క శైలి తరువాత కాలములలో సిద్ధాంత గ్రంథములను రచించిన గ్రంథకర్తలు అందరూ అనుసరించారు. సూర్య సిద్ధాంతములో విషయము సూత్ర రూపములో మాత్రము చెప్పండి దాన్ని బోధపర్చుకొని అనుసరించుటకు గణితములో ప్రావీణ్యత ఉన్నవారికి సాధ్యమయింది. అందువలననే సూర్య సిద్ధాంతముపై అనేక భాష్యములు, వ్యాఖ్యానములు, కరణ గ్రంథములు రచింపబడ్డాయి. భాస్కరాచార్యుని సిద్ధాంత శిరోమణి దీనికి వేరుగా స్వకృత వాసనాభాష్యముతోను, ఉపపత్తులతోను కూడి సిద్ధాంతమును శిఖరాగ్రమునకు చేర్చింది. మరొక ముఖ్య విషయము: సూర్య సిద్ధాంతము, ఆర్యభటీయము, పంచ సిద్ధాంతిక, బ్రహ్మస్పుట సిద్ధాంతము. తదుపరి కొన్ని శతాబ్దాలవరకు రచించిన వివిధ సిద్ధాంత గ్రంధములలో అయనాంశ గూర్చి చర్చించలేదు. భాస్కరుని సమయములో || అంతల అయనాంశ ఉందని ప్రయోగము ద్వారా తెలుసుకొని, అయనాంశను లెక్కలోనికి తీసుకొని అన్ని గణితములు ఉపమానములతో భాస్కరులు వివరించారు.