• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sikkolu Rajakeeya Charitra

Sikkolu Rajakeeya Charitra By Dr Gunta Leela Varaprasadarao

₹ 200

కళింగాంధ్ర చారిత్రక నేపథ్యం

-

ఆధునిక ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలో భాగంగానూ, భాషా, సాహితీ పరంగా ప్రత్యేక మాండలిక మండలంగానూ నేడు ప్రాచుర్యం పొందిన ఈ ప్రాంత విశిష్టత, తెలుసుకోవాలంటే కళింగ దేశ చరిత్రను ఒకసారి చుట్టి రావలసిందే. ప్రాచీన, మధ్యయుగాలలో ప్రస్తుత ఈ ప్రాంతం, కళింగ దేశంలో అంతర్భాగాలుగా ఉండేది. అందుకే ఈ ప్రాంతాన్ని కళింగాంధ్ర అంటూ పిలుస్తూ వచ్చారు. తూర్పు కనుమల ఒడిలో సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న భూభాగమే కళింగ దేశం. చరిత్ర పుటల్లోకి ఒకసారి తొంగి చూసినట్లయితే....

అశోకుడిని ఎదురిస్తూ :-

క్రీ.పూ. 272 నాటికి మౌర్య

సామ్రాజ్య నేత బిందుసారుడు (క్రీ.పూ. 298-273) మరణ సమయానికి భారత ఉపఖండమంతా మౌర్యుల సార్వభౌమాధికారం క్రిందకు

వచ్చింది. కాని తూర్పుతీర ప్రదేశమైన కళింగ దేశాన్ని బిందుసారుడు జయించలేకపోయారు. అయితే క్రీ.పూ. 273లో రాజుగా పట్టాభిషేకం చేసిన బిందుసారుడు కుమారుడు అశోకుడు క్రీ.పూ. 262-61 లో కళింగ దేశంపై దండ యాత్ర చేశారు. ఆనాడు సర్వస్వతంత్రులైన గణాధిపతులు పాలనలో వంద మట్టి కోటలతో కళింగ రాజ్యం నిండి ఉండేది. “గణ” పాలనా వ్యవస్థలో పాలకులు, పాలితలు అనే బేధాలు ఉండేవి కావు. అందరూ సమిష్ట జీవన విధానం కలిగి ఉండి తమ తమ వృత్తులు చేసుకుంటూ జీవించేవారు. పరాయివారు తమ 'గణా'ల మీదకు యుద్ధాలకు వస్తే సమిష్టగా ఎదుర్కొనేవారు. నియంతలైన రాజుల పాలనలో జీవించడానికి ససేమీరా ఒప్పుకునేవారు కాదు. అటువంటి సమయంలో అశోక చక్రవర్తి ' తమ దేశంపై దండయాత్ర చేయడాన్ని జీర్ణించుకోలేక వీరంతా ప్రతిఘటించారు. కళింగ దేశపు ఉత్తర సరిహద్దు అయిన శిశుపాలఘర్ వద్ద అశోకుడిని ఎదుర్కొంటూ ఉవ్వెత్తిన లేచారు కళింగ వీరులు. వీరోచితంగా పోరాడి లక్షమంది వరకూ అమరులయ్యారు. అంతకంటే ఎక్కువగా నిర్వాసితులయ్యారు. అయినా తమ కళింగ దేశాన్ని కాపాడుకోలేకపోయారు. అశోకుడి పాలనలో అత్యంత ముఖ్య ఘట్టంగా నిలిచిన ఈ కళింగ యుద్ధం తరతరాల చరిత్రనే తలకిందులు చేసి తొలిసారిగా కళింగ ప్రాంతం పరాయిల వశమయ్యేందుకు కారణమయ్యింది. కళింగ యుద్ధం అనంతరం బౌద్ధ బిక్షువుగా మారి క్రీ.పూ. 232 వరకూ అశోకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. తర్వాత క్రీ.పూ. 232-185 వరకూ చివరి మౌర్య పాలకుడు బృహద్రదుడు పరిపాలించారు. ఇతను మౌర్య సేనాని పుష్యమిత్ర శుంగుడిచే చివరకు వధించబడ్డారు. అనంతరం క్రీ.పూ. 185-71 వరకూ శుంగవంత పాలన, కణ్వ వంశీయుల స్వతంత్ర పాలన ప్రభావానికి కళింగ ప్రాంతం కొంత లోనయ్యింది...............

  • Title :Sikkolu Rajakeeya Charitra
  • Author :Dr Gunta Leela Varaprasadarao
  • Publisher :Dr Gunta Leela Varaprasadarao
  • ISBN :MANIMN4918
  • Binding :Papar back
  • Published Date :April, 2023
  • Number Of Pages :232
  • Language :Telugu
  • Availability :instock