₹ 200
రాహుల్ సాంకృత్యాయన్ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్కృత బాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు , సుమారు 10 సంవత్సరాలుగా సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్ర్య యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి, లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్య భాష బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద్ధ భారతీయుడు. హిందూ సన్యాసిగా, ఆర్యసమాజకునిగా, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బౌద్దిభిక్షువుగా ఈయన పేరు పొందారు.
వీరు చేసిన బాషా సేవకు కాశీ పండితులు వీరిని "మహాపండిత్" బిరుదుతో గౌరవించారు. బౌద్ధవేదములు మూడింటింలోను ఈయన నిధి. అందువల్ల బౌద్ధ విజ్ఞానులు ఈయనకు "త్రిపీఠకాచార్య " బిరుదు నిచ్చారు.
తెలుగు పాఠకులకు సుపరిచితమైన "సింహసేనాపతి"రచనను 1942 సంవత్సరంలో రాశారు.
- Title :Simha Senapathi
- Author :Rahul Sankrityayan
- Publisher :Visalandhra Publishing House
- ISBN :MANIMN1049
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :264
- Language :Telugu
- Availability :instock