• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sipaayi Vikranth

Sipaayi Vikranth By Mudda Suresh

₹ 200

సిపాయి విక్రాంత్

అస్సాంలోని సిల్హట్ ప్రాంతం........

సిల్హట్ కొండప్రాంతం కొండలనిండా తేయాకు తోటలు......

సాయంత్రమయింది.... అప్పటిదాకా తేయాకు తోటలో నిర్విరామంగా పనిచేసిన ఉజ్వల చద్దర్ తో నుదుటిమీద పట్టిన చిరుచెమట అద్దుకుంది .

కూలిడబ్బులు మూడు వంద నోట్లు తీసుకొని రీహాలో దాచుకుంది.... అస్సాం స్త్రీలు మూడు భాగాలుగా సాంప్రదాయక దుస్తులు ధరిస్తారు.... నడుంనుంచి మోకాలి దిగువదాకా పరికిణీ లాంటి మేఖల ధరించింది .... నడుం నుంచి మోచేతులదాకా ధరించే వస్త్రాన్ని రీహా అంటారు... రీహామీద చద్దర్ కప్పు కుంటారు.

రంగు రంగుల ఆ సాంప్రదాయక దుస్తుల్లో ఉజ్వల కొండ దిగుతున్న వనదేవతలా షేన్ వుంది....

కొండ దిగువకు చేరి, తల వంచుకు ముందుకు నడుస్తున్న ఉజ్వల వులిక్కి పడింది. బాటప్రక్కనుంచి మాటలు వినబడ్డంతో....

"ఎన్నాళ్ళు ఎదురు చూస్తావ్ ?.... ఆ పారిపోయిన విక్రాండ్గాడి గురించి ?"....

హేళనతో కూడిన ఆ మాటలు.....

ములుకుల్లా తాకాయ్ ఉజ్వల హృదయాన్ని... కంపిస్తూ మాటలు వినబడ్డవైపుకు తిరిగింది. అంతే! ఉజ్వల గుండె లయతప్పి కొట్టుకోసాగింది......

పొదల చాటుగా స్కూటర్ మీద నిలబడి చూస్తున్నాడు టీ ఎస్టేట్ యజమాని కొడుకు షేరా !

ఉజ్వల తనను చూడ్డం గమనించి స్కూటర్ చటుక్కున దిగి స్టాండువేసి నాలుగడుగులు ముందుకు వేసాడు.

"ఉజ్వలా! చదువుకున్న దానివి, ఈ కూలిపని ఎందుకు? నా మాట విను.... నిన్ను టీ ఎస్టేట్క యజమానురాల్ని చేస్తాను.”....................

  • Title :Sipaayi Vikranth
  • Author :Mudda Suresh
  • Publisher :Classic Books
  • ISBN :MANIMN5878
  • Binding :Papar Back
  • Published Date :Dec, 2024
  • Number Of Pages :156
  • Language :Telugu
  • Availability :instock