జనని భారతి
“మన బ్యాచ్లో చాలామంది యు.ఎస్. వెళ్ళడానికే మొగ్గు చూపుతున్నారు. ఇటీజ్ ఎ వైజ్ డెసిషన్. ఆ కావేరి, నీ నిర్ణయం చెప్పలేదు. యు.ఎస్. కా ఆస్ట్రేలియా కా?” అడిగాడు రాహుల్.
అతని ప్రశ్నకి దీర్ఘంగా శ్వాస విడిచింది కావేరి. "నేనింకా ఎటూ డిసైడ్ అవ్వలేక పోతున్నాను. ఇంటికి వెళ్ళాకా ఆలోచించి నీకు ఫోన్ చేస్తాను” అంది కావేరి.
"ఓకే. టేక్ యువర్ ఓన్ టైం. కానీ ఇండియాలోనే ఉంటానన్న స్టుపిడ్ ఆలోచన మాత్రం పెట్టుకోకు” అన్నాడు రాహుల్ బిగ్గరగా నవ్వుతూ.
అతని మాటలకి కావేరి మనసులో కొద్దిగా బాధ కల్గింది. బెంగళూరులో మెడిసిన్లో పి.జి. చేసిన తెలుగువారి ఫేర్ వెల్ పార్టీ అది. రాహుల్ వాళ్ళు అందరికీ లీడర్. ప్రస్తుతం ఈ పార్టీని స్పాన్సర్ చేసింది అతనే..
పార్టీ అయ్యాకా రూమ్కి వచ్చి, లగేజి సర్దుకుని ట్రైన్ ఎక్కింది కావేరి. ఆమె స్నేహితులు చాలా మంది విమానంలో వెళ్ళిపోయారు. మర్నాడు ఉదయం తణుకులో ట్రైన్ దిగి, నర్సాపురం బస్సు ఎక్కి శివపురం వచ్చింది కావేరి. రమణమ్మ కూతుర్ని కౌగలించుకుని చాలా సంతోషపడింది................