ముందుమాట
ఎర్ర పావురాలు (1977) - అలిశెట్టి ప్రభాకర్
ఎరుపంటే కొందరికి
భయం, భయం
పసిపిల్లలు వారికన్న
నయం, నయం
అని సుబ్బారావు పాణిగ్రాహి అన్నాడు. ఎరుపురంగు చూసి జడుసుకునేవారు ఉంటే, 'ఎరుపు' మాటను సాహిత్యంలో వాడడానికి భయపడి చచ్చేవాళ్ళు చాలా మంది కవుల్లో వున్నారు. ఎరుపు దేనికి సంకేతమో నే చెప్పనక్కరలేదు. మరి అలిశెట్టి ప్రభాకర్ కవితా సంపుటి పేరే 'ఎర్ర పావురాలు.' నాకీ పదబంధం నచ్చింది. కొత్తది కావడం ఒకటి, ఆ పదబంధం ప్రసరింపజేసే అర్థవలయాలు విస్తృతమైనవే- పావురం శాంతికి సంకేతం. కాని ఎర్రపావురాలు దేనికి సంకేతం- నిజానికి పాఠకుడి ఊహకి వదలడం చాలా ఉత్తమం. శాంతిని కాపాడుకోవాలంటే ఎర్రదనం కావాలి.
ఈనాడు ప్రతి రచయితా వంగిపోయి, గూనివాడయి, కబోదయి బతుకు తున్నాడు. నిటారుగా నడవడం చేతగాదు. ఎదురు తిరగడం తెలియదు. భయం వాణ్ణి ఆవరించిన అజ్ఞానం, దయ్యం. వాడు రాజీపడి అందరినీ రాజీపడమని తలొగ్గమని ఓడిపొమ్మని ఉద్బోధ. ఈ రకం వాళ్ళకి ఎన్నైనా సౌకర్యాలు, లాభాలు చేకూరవచ్చు. విద్రోహ సాహిత్య ప్రతినిధులు వీళ్ళు-
మరి ప్రభాక రెండో మార్గమని నేననుకొంటా- రాజీపడని పోరాట పటిమతో 'కవిత్వం రాయడం సులువు కాదు. బాగా పరిచయమైన వాటిని తీసికొని కవిత్వం చేయడం సులువుకాదు. దానికి నిరంతర సాధన, శిల్పం మీద ధ్యాస వుండాలి. ప్రభాకర్కి ఈ విషయం తెల్సు. ముడిసరుకుని కళ చేయటమెలాగో తెలుసునని ఇందులోని చాలా కవితలు చెబుతాయి. మనల్ని పక్కకి తోసి, మనకి.................