• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Smruthi Shakalalu

Smruthi Shakalalu By Aluri Bhujangarao

₹ 30

సాహిత్య బాటసారి - శారద స్మృతిశకలాలు

1948 నుండి 1955 వరకు ఏడెనిమిది సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా రచనలు చేసి ఆనాటి కథా-నవలా సాహిత్యంలో | ప్రత్యేకమైన గుర్తింపు పొందిన రచయిత 'శారద'

అతడి అసలు పేరు యస్. నటరాజన్. తమిళదేశస్తుడు. తమిళులు తండ్రి పేరునే ఇంటిపేరుగా వాడుకుంటారు. నటరాజన్ తండ్రిపేరు సుబ్రమణ్యయ్యరు కనుకనే నటరాజన్ పేరుకుముందు 'యస్' వచ్చింది.

నటరాజన్ 1937వ సంవత్సరం చలికాలపు (?) ఓ నాటి ఉదయాన తెనాలి రైల్వేప్లాట్ఫారం మీద కాలు మోపాడు. అప్పటికి అతడికి పన్నెండేళ్ళ వయస్సు. మద్రాసులో 7వ తరగతి చదువుతూ అక్కడి వస్తుల్ని భరించలేక - ఇంక ఆ మహాపట్నంలో బతకలేక వృద్ధుడైన తండ్రిని వెంటపెట్టుకుని, "ఆంధ్రా ప్యారిస్” తెనాలికి వచ్చాడు.

ఎర్రగా, సన్నగా, రివటలా వున్న పన్నెండేళ్ళ పసివాడు, పలుచటి ముఖం, తీర్చిదిద్దినట్టున్న కళ్లు, ఒక కన్ను కొంచెం మెల్ల, తీక్షణమైన చూపులు, అరచేతుల చొక్కా, తెల్లటి పంచె అడ్డకట్టు. ఇదీ అప్పటి అతడి వేషం.......................

  • Title :Smruthi Shakalalu
  • Author :Aluri Bhujangarao
  • Publisher :Sk Mahamuddin Bachha
  • ISBN :MANIMN5749
  • Binding :Papar Back
  • Published Date :1985 First print
  • Number Of Pages :140
  • Language :Telugu
  • Availability :instock