కాగితం దేవుళ్ళు
ఆ రోజు ఆదివారం ...
వాలు కుర్చీలో వాలిపోయి పేపర్ చూస్తున్నాడు చలపతి. భార్య సులోచన కాఫీ తెచ్చి యిచ్చింది. సరిగ్గా అదే సమయంలో ఇంటి ముందు స్కూటర్ ఆగింది. 'ఎవరా' అని వీళ్లు ఆసక్తిగా చూసే లోపలే గేటు తీసి వస్తూ “బాగున్నారా” అంటూ పలకరించారు. యామిని, శ్రీనివాస్ లు. రెండు వీధుల వెనక ఉంటారు వాళ్లు.
“రండి... రండి” ఆదరంగా ఆహ్వానించారు సులోచనా, చలపతి.
“మా అమ్మాయికి పెళ్లండీ" అంటూ బొట్టు పెట్టి చెప్పింది యామిని. శ్రీనివాస్ వెడ్డింగ్ కార్డు మీద చలపతి పేరు రాసి అందించాడు.
వెడ్డింగ్ కార్డుపైనున్న వినాయకుడి బొమ్మను చూసి కళ్లు మూసుకుని మనసులోనే దండం పెట్టుకున్నాడు చలపతి. కార్డు చాలా బాగుందని కూడా మెచ్చుకున్నాడు. మాటల్లో కట్న కానుకలు, పెళ్లి ఖర్చులు... పెట్టిపోతల వివరాలు అన్నీ చెప్పాడు శ్రీనివాస్. సులోచన కాఫీ తెచ్చి ఇచ్చింది. కాఫీ తాగేసిన ఐదు నిముషాల తర్వాత వెళ్లిపోయారిద్దరూ. "వెడ్డింగ్ కార్డు చాలా బాగుంది కదూ. మన అమ్మాయి పెళ్లికి యిలాగే కొట్టిద్దాం” మరోసారి కార్డుమీది వినాయకుడికి దండం పెట్టుకుంటూ అన్నాడు చలపతి.
భర్తని పైనుంచి కిందకి నిశితంగా చూసి విసురుగా లోపలికి వెళ్లింది సులోచన.
***
చలపతి ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తున్నాడు. సులోచన ఎం.ఏ. చదివినా ఉద్యోగం కంటే పిల్లల చదువులకు, వాళ్ల భవిష్యత్తుకు ప్రాధాన్యం ఇచ్చి ఇంట్లోనే ఉండిపోయింది. సులోచన అనుకున్నట్టుగానే పిల్లల్ని ఇంజనీర్లను చేసింది. రెండు సంవత్సరాల క్రితం - అబ్బాయికి, మూడు నెలల క్రితం అమ్మాయికి ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం అమ్మాయి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నారు కూడా .....
తనది అన్ని విధాలా హ్యాపీహోమ్ అనుకున్నా ఒకే ఒక్క విషయంలో అప్పటినుండీ యిప్పటి దాకా మానసికంగా చిరాకు కల్గిస్తున్నది.... అది భర్తకున్న చాదస్తం ...
పెళ్లి కాగానే హైదరాబాదులో ఉంటున్న అతని దగ్గరకు కాపురానికి వచ్చింది. సులోచన. ఒకే ఒక్క గది. గది నిండా ఎక్కడ చూసినా వెడ్డింగ్ కార్డులు... గోడలకు...............