సొంతిల్లు
ఏం అయింది ఈ రోజు? ఈ రోజు ఏం రోజు పీరియడ్స్ రెండో రోజు. తలనొప్పితోనే రోజు మొదలు. కాళ్ళు పీకుతుంటాయి. నడుము లాగుతుంటుంది. లోపలి తొడల నొప్పులుంటాయి. అలాగే ఉంటుందనుకుంటే అంతే సంగతి. కదలడమే మంచిది కొన్ని కొన్నిసార్లు.
నేనూ చెన్నై స్నేహితులం కలిసి, నాలుగు గంటలు తలో మాటా మాట్లాడుకుని, ఇళ్ల దార్లు పట్టేటప్పటికి రాత్రి 10 అయ్యింది. వాళ్ళు సొంత బండ్లూ కార్లూ తీస్తే, నాకు కక్కబుద్ధికాక ఆటో బుక్ చేసుకున్నాను. దూరం నుండి లైట్ వెలుగులో పసుపచ్చరంగు ఆటో చాలా వేగంగా వచ్చి కళ్ళ ముందు ఆగింది. సముద్రాన్ని | విడిచి వెళ్ళడమే మంచిదని అనిపించిన అతి తక్కువ రోజుల్లో అదీ ఒకటి. దేని నుండి పారిపోతున్నానో వెనక్కి తిరిగి చూసుకుంటే నాలుగేళ్ల జ్ఞాపకాలు గాల్లో నా చుట్టూ కదిలాయి. కళ్లు తిరిగాయి. ఆటోలో ఎక్కి కూర్చొని నా పేరూ, ఊబర్ ఓ.టి. | పీ 4232 అని చెప్పాకకాని ప్రాణం కుదుటపడలేదు. గాలాడలేదు.
చెవుల్లో పాటల గుంపు. మనసులో స్మృతుల మూక. గతకాలపు కిలకిలల కలకలం.
***
డేటింగ్ ఆప్స్ కొత్త. సరదాగా టిండర్ వాడే రోజులవి. చేతిలో గిటార్...............................