శ్రీ మత్సరమహంస పరివ్రాజకాచార్య శంకర భగవత్సట్రీత
సౌందర్య లహరి
శివ శక్త్యా యుక్తోయది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి ।
అతస్త్వా మారాధ్యాం హరిహరవిరిఞ్చదిభిరపి
ప్రణస్తుం స్తోతువా కథమకృతపుణ్యః ప్రభవతి ॥
వచనం: పెట్టిపుట్టిన వాళ్ళకు తప్ప పట్టదుగదా తల్లీ, నీ పాద సేవా యోగం! సర్వంసహా శక్తిరూపిణివి నువ్వు. అటువంటి నీతో కూడుకుని వున్నప్పుడు మాత్రమే ఆ శివుడు సృష్టికార్యాన్ని నిర్వహించగలుగుతాడు. అలా కానప్పుడు అంటే, నీ నుండి రవ్వంతైనా యెడం కావడమే జరిగితే వాడు శివుడే యౌ గాక, స్థాణువులాగా చతికిలబడిపోవడమే తప్ప విడిచి, చిటమంతైనా చలించలేడు. హరి, హర, బ్రహ్మాదులంతటి వాళ్ళ చేత అనునిత్యమూ ఆరాధించ బడుతూ వుండే తల్లివి నువ్వు. అలాంటి సర్వోన్నతస్థాయిలో వుండే నిన్ను స్ఫరించాలన్నా, నిన్ను స్తుతించాలన్నా, నీకు నమస్కరించుకోవాలన్నా యెంతో పుణ్యం జేసుకుని పుట్టాలేగాని, యేదో పాపానుభవం కోసమే ప్రభవించిన వాళ్ళకి యెలా సాధ్యమవుతుంది తల్లీ!...........