• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Spiritual Anatomy

Spiritual Anatomy By Kamalesh D Patel

₹ 499

మీ అంతరంగ యాత్ర: నిజమైన పరివర్తనకు మూలం

చాలా కాలం క్రితం ఒక సాధువు తన శిష్యులతో ఒక రాజ్యం ద్వారాల వద్ద రాజుగారి ఆశ్రయం కోరి వేచి ఉన్నాడు. భటులు అతిథులకి ఆహార పానీయాలు ఇచ్చారు. ఇంతలో మరొక భటుడు రాజుకు సమాచారం ఇవ్వడానికి లోనికి పరుగెత్తాడు. భటుడు సమాచారం చెప్పగానే, రాజు కాసేపు ఆలోచించి, ఒక కుండ నిండా నీళ్లు తెప్పించాడు. ఒక భటుడిని పిలిచి ఆ కుండని సాధువుకు ఇమ్మన్నాడు.

ఆ సాధువు దానికోసమే ఎదురు చూస్తున్నట్లుగా, ఆ కుండని అందుకున్నాడు. చిరునవ్వుతో ఆ భటుణ్ణిచూస్తూ, ఒక పిడికెడు పంచదార కావాలని అడిగి, దాన్ని ఆ నీళ్ళల్లో కలిపాడు. పంచదార ఆ నీళ్లలో పూర్తిగా కరిగే వరకు నీళ్ళని కలియతిప్పాడు. అప్పుడు ఆ కుండని మళ్లీ రాజుగారికి ఇమ్మని భటుడికి చెప్పాడు.

పూర్తిగా గందరగోళంలో పడిన భటుడు, హడావుడిగా మళ్లీ ఆ కుండని రాజుగారికి అందజేశాడు. భటుడు ఏదో చెప్పబోతుండగా రాజు అతడిని వారించి, తన మంత్రిని నీటిని రుచి చూడమన్నాడు. "నీరు తియ్యగా ఉంది ప్రభూ!" అన్నాడు. మంత్రి.

రాజు పెదవులపైన ఒక చిరునవ్వు వెలిసింది. "ఆ సాధువును తన శిష్య బృందంతో సహా గౌరవ మర్యాదలతో లోపలికి తీసుకురండి" అని ఆజ్ఞాపించాడు. ఆ తరువాత ఆయన మంత్రి వైపు తిరిగి - "వారు ఇక్కడ ఉండడానికి అన్ని సౌకర్యాలు సమకూర్చండి, వారు ఎంతకాలం ఉండాలనుకుంటే అంతకాలం ఉండమనండి" అన్నాడు.

మీరు కూడా ఆ రాజభటుడిలాగా ఆశ్చర్యపోతూ ఉంటే, అక్కడ జరిగిన విషయం వినండి: ఆశ్రయం కోరుతూ చేసిన అభ్యర్ధన రాజుకు చేరగానే, ఆయన ఒక కుండ నిండా నీళ్లు ఆ సాధువుకు పంపాడు. అది ఒక నిగూఢ సందేశం, "మా.................

  • Title :Spiritual Anatomy
  • Author :Kamalesh D Patel
  • Publisher :Manjul Pablication House
  • ISBN :Kamalesh D Patel
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :281
  • Language :Telugu
  • Availability :instock