అభివృద్ధి క్రమంలో మార్పు (పరివర్తన) అనేది కీలక దశ అనే ప్రామాణికమైన విషయాన్ని ఈ అధ్యయనం మళ్ళీ ముందుకు తెస్తుంది. మార్పు సాంప్రదాయక పనులని అనావశ్యకమైనవిగా చేసి, శ్రామికుల్లో అధిక భాగాన్ని స్థానభ్రంశం కావిస్తుంది. శ్రామికులందరిలోకెల్లా, వ్యవసాయంతో సహా అనేక సాంప్రదాయకమైన పనుల్లో ఉన్న మహిళలపై ఈ మార్పుల ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని ఈ అధ్యయనంలోని ఆధారాలు నిరూపిస్తాయి. మార్పుతో సమాజం మీద వచ్చే ప్రతికూల ఫలితాలని ఎదుర్కోవడానికి రాజ్యం సరైన చర్యలు చేపట్టడమనేది ప్రతి నాగరిక సమాజం ఎదురుగా ఉన్న పెద్ద సవాలు. ఐతే, నయా ఉదారవాద రాజ్యం మహిళా కార్మికులని తిరిగి ఉత్పత్తిదాయక పనుల్లోకి కలుపుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోదు.
ప్రశ్నించే స్వభావమున్న ఏ అభివృద్ధి విద్యార్థికైనా ఈ పుస్తకం చదవడం ప్రతిఫలదాయకమైనది.
ప్రొ. డి. నర్సింహారెడ్డి