స్రవంతి
Love is like a virus. It can happen to anybody at any time. -Maya Angelou
భగవంతుడు వజ్రానికి ఉండే కాఠిన్యాన్ని, పులికి ఉండే క్రూరత్వాన్ని, గుంటనక్క ఉండే జిత్తులమారితనాన్ని, మేఘానికి ఉండే కన్నీటిని, గాలికి ఉండే చలనాన్ని, తేనెకి ఉండే తీయదనాన్ని, ఉదయపు ఎండకి ఉండే వెచ్చదనాన్ని, పక్షి ఈకకి ఉండే మృదుత్వాన్ని, లేడి పిల్లకి ఉండే చురుకుదనాన్ని, పురివిప్పి ఆడే నెమలికి ఉండే ఆకర్షణని, కుందేలుకి ఉండే భయాన్ని, పువ్వులోని పరిమళాన్ని, సంధ్యాసమయపు సౌందర్యాన్ని తీసుకున్నాడు. వాటి గుణాలన్నింటినీ కలిపి, ఆ మొత్తాన్ని బాగా రంగరించి, ఆ మిశ్రమంలోంచి ఓ యువతిని తయారుచేసాడు. ఆమెని ఓ మగవాడికి బహుమతిగా ఇచ్చాడు.
ఆ యువతి పేరు స్రవంతి.
ఆ మగాడు శ్రీనివాస్.
శ్రీనివాస్ కాచిగూడ రైల్వే స్టేషన్ ముందు ఆటో దిగాడు. చేతి గడియారం వంక చూసుకుని జేబులోంచి మనీ పర్స్ తీసాడు. ఆటో ఫేర్ చెల్లించి ఆటోలోని తన సూట్ కేస్ని, లెదర్ బేగ్న రెండు చేతులతో అందుకుని ఆదరాబాదరాగా రైల్వే స్టేషన్లోకి పరిగెత్తాడు. "వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వచ్చిందా?" గేటు దగ్గర ఉన్న టి.సి.ని అడిగాడు.........................