ప్రతి మనిషీ తన జీవితంలో అనుభవించిన భావాల సమ్మేళనం.. చదువుతూ చేయండి మీరూ మాతో ప్రయాణం..
దెబ్బలు తిన్న రాయి విగ్రహంలా మారుతుంది. కానీ..
దెబ్బలు కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తిలాగే ఉండిపోతుంది..
ఎదురు దెబ్బలు తిన్న వారు, నొప్పి విలువ తెలిసిన వారు
ఎప్పటికైనా జీవితంలో ఎదుగుతారు.
ఇతరులను ఇబ్బంది పెట్టేవారు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతారు.
గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా
సువాసనను ఇస్తుంది..
అలాగే... మంచి వ్యక్తిత్వం ఉన్నవారు తమను దూషించే వారికి,
ద్వేషించేవారికి కూడా మంచే చేస్తారు.
గులాబీ పువ్వు కింద ముళ్ళు ఉంటాయి.
అయినా.. ముళ్ళపై కూడా పూలు వికసిస్తాయి.
అలాగే.. జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి.
అయినా వాటిని ధైర్యంగా అధిగమిస్తే..
కచ్చితంగా విజయం సాధిస్తాం.
ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ అడ్డువచ్చినా..
స్పీడ్ తగ్గించుకుని నిదానంగా దాటగలిగితే
రోడ్డు మీద పడిపోకుండా వెళ్ళిపోవచ్చు.
అలాగే...
ఎంత పెద్ద సమస్య ఎదురైనా....
శాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే
జీవితంలో గొప్ప స్థానానికి చేరుకోవచ్చు.
జీవితంలో కొన్ని సార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు..
కానీ.. నిజానికి.. ఆ ఒంటరితనమే జీవితం అంటే ఏమిటో నీకు నేర్పిస్తుంది.....................................................