గురుభ్యోన్నమః
పూర్వము దుంబర దీక్ష యని శ్రీ దత్తత్రేయ స్వాములవారి ప్రీకృద్ధమై నిర్వహించేవారు. మేడి పూలమాల ధరించి, కఠిన బ్రహ్మచర్యము, నాచరిస్తూ సాత్విక 'హవిషాన్నము' స్వీకరిస్తూ మండల కాలము దీక్షను నిర్వహించి శ్రీదత్తుని అనుగ్రహానికి తలయ్యేవారు. కాని కాలక్రమేణా అంతటి కఠోర నియమములు ఆచరించలేక మరుగునపడిపోయింది.
కాని మరలా అయ్యప్పదీక్షలు ప్రచారంలోనికి వచ్చిన తరువాత అనేక దీక్షలు బహుళ ప్రచారములోనికి వచ్చాయి. సద్గురునాధులు శ్రీ షిర్డీసాయిబాబావారి మహామహిమాన్విత చరిత్ర వెలుగులోనికి వచ్చిన తరువాత, బాబాగారి పేరుతో షిర్డీయాత్ర బాబాజీవిత చరిత్ర పారాయణ, (దత్త) గురుచరిత్ర పారాయణ, దత్తక్షేత్ర సందర్శనములు నేడు ఆచరణలోకి వచ్చాయి. నాధ సాంప్రదాయములో నిర్వహించే ఈ దీక్షలు నేడు ఉత్తర భారతములో విస్తుృత ప్రచారముపొంది, దక్షిణాదిన, ముఖ్యంగా తెలుగునాట విశిష్టభక్తి ప్రపత్తులతో నిర్వహిస్తున్నారు.
అలాగే తమిళనాడులో "మురుగన్ దీక్ష పసుపు పచ్చని దీక్షా వస్త్రములు ధరించి,
అట్ట పాలకావడి, పూలకావడి ధరించి, పాదయాత్ర చేస్తూ ప్రసిద్ధ (సుబ్రహ్మణ్య' క్షేత్రములు దర్శిస్తూ విరివిగా భక్తులు వస్తున్నారు. పళని క్షేత్రములో షుమారు వేయిమెట్ల మీదగా, 'కావడి'తో ప్రయాణిస్తూ, మెట్టు, మెట్టుకు కర్పూరం వెలిగిస్తూ, స్కంధా. మురుగా, షణ్ముఖా, సుబ్రహ్మణ్య, దండాయుధపాణి, వేలాయుధనే అంటూ ఎలుగెత్తి స్వామిని ప్రార్థిస్తూ నృత్యం చేస్తూ భక్త్యావేశంతో ఊగిపోతుండే భక్త మహాశయులను చూస్తుంటే తనువూ, మనసూ పులకరించిపోతుంది. అలాగే సమయపురం మారియమ్మ అమ్మ దీక్షలు తీసుకొన్న స్త్రీలు దీక్షావస్త్రములు ధరించి వేప మండలు చేత ధరించి, భక్త్యావేశంతో నృత్యంచేస్తూ, అంగప్రదక్షిణాలు చేస్తూ, వైరాల మూకుడుచేత ధరించి చేసే విన్యాసాలు చూస్తుంటే శరీరముగగుర్పొడుస్తుంది.
నేడు ఆంధ్రదేశములో శివదీక్షలు, భవానీ దీక్షలు, గోవిందమాల (శ్రీ వెంకటేశ్వరస్వామి దీక్ష) శ్రీ నీలంపాటి అమ్మవారి దీక్ష్మశ్రీలక్ష్మీ తిరుపతమ్మ దీక్ష శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి 'వీరగురుదీక్ష' శ్రీ ఆంజనేయస్వామిదీక్ష, యిలా ఎన్నో దీక్షలు నేడు విస్తుృత ప్రచారంలోకి వచ్చాయి. ఈ పరిణామం హర్షించదగిందే. మానవ విలువలు నశించిపోయి, అస్తిత్వము కోల్పోయి, నాస్తికత్వ వాదనలు చోటు చేసుకునే విష సంస్కృతి ప్రబలుతున్న ఈ కాలములో, దేవతారాధాన, మానవత్వ విలువల పునరుద్ధరణ, సేవానిరతి, సాంప్రదాయాలపట్ల సనాతన సంస్కృతిపట్ల, శాస్త్రీయ అవగాహన పెరగటం, ఈదీక్షల కారణంగానే మరలా చోటు చేసుకుంటూ వైదిక సంస్కృతి పునరుద్ధరణ జరుగుతుందనటంలో ఏమాత్రం సందేహంలేదు.................