• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sri Dadala Raphael Ramanayya

Sri Dadala Raphael Ramanayya By Bolloju Baba

₹ 100

బాల్యం, విద్యాభ్యాసం

యానాంకు రెండుకిలోమీటర్ల దూరంలో ఉండే ఫరంపేట అనే గ్రామంలో 30, జూన్ 1908న శ్రీ దడాల రఫేల్ రమణయ్య జన్మించారు. వీరికి నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రిగారు మరణించారు. అప్పటికి వీరి తల్లిగారికి 18 ఏండ్లు. ఆమె పునర్వివాహం చేసుకోవటంవల్ల వీరు తన నాయినమ్మ శ్రీ వీరమ్మ వద్ద పెరిగారు.

అప్పటి యానాం చర్చి ఫాదరైన Artic, పది సంవత్సరాల వయసున్న దడాలలోని చురుకుదనాన్ని గుర్తించి విజయవాడ సెయింట్ ఆంథోని స్కూలులో జాయిన్ చేయించారు. 1919లో దడాల బాప్టిజం తీసుకొన్నారు. ఫాదర్ ఆర్టిక్ స్థానంలో శ్రీ Gangloff యానాం చర్చి ఫాదరుగా వచ్చారు. ఈ సమయంలో చదువుకు అంతరాయం కలగటంతో రోజుకు నాలుగణాల కూలికి పొలంపనులకు వెళ్లారు కొంతకాలం. తరువాత యానాం చర్చిలో నెలకు 6 రూపాయిల జీతానికి తోటమాలిగా పనికి కుదిరారు. ఫాదర్ గాంగ్లాఫ్ దడాలలో చదువుపట్ల ఉన్న జిజ్ఞాసను గుర్తించి పనిచేస్తూనే యానాం ఫ్రెంచి స్కూలులో చదువుకొనటానికి అనుమతించారు. అలా వీరు ఉదయం 5 నుంచి 8 గంటలవరకు, మధ్యాహ్నం 11 నుంచి 1 గంట వరకూ తిరిగి సాయింత్రం 5 నుంచి 7 గంటలవరకూ చర్చిలో పనిచేస్తూ మిగిలిన సమయంలో చదువుకొనేవారు. ఇన్ని పరిమితుల మధ్య కూడా గొప్ప ప్రతిభతో యానాంలో అందుబాటులో ఉన్న విద్యను పూర్తిచేసారు దడాల.

1926లో ఫాదర్ గాంగ్లాఫ్ దడాలను పాండిచేరీలోని Petit Seminaire హైస్కూలులో చేర్చారు. తరువాత వీరు అక్కడే ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బి.ఎ. చదువు పూర్తి చేసారు. అన్యాయం జరిగినప్పుడు అందరిలా మనకెందుకులే అని తప్పించుకోక, అవతలి వ్యక్తులు ఎంతపెద్దవారై నప్పటికీ, తనకు ప్రమాదం కలగొచ్చుననే విషయాన్ని కూడా లెక్క చేయక........

  • Title :Sri Dadala Raphael Ramanayya
  • Author :Bolloju Baba
  • Publisher :Pallavi Publications
  • ISBN :MANIMN4049
  • Binding :Papar back
  • Published Date :Jan, 2023
  • Number Of Pages :80
  • Language :Telugu
  • Availability :instock