ఆచారకాండము
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోనమః
నారాయణం నమస్కృత్య, నరంచైవ నరోత్తమమ్ |
దేవీం సరస్వతీం వ్యాసం, తతో జయముదీరయేత్ II
పురాణాలు ఎప్పుడు ప్రారంభించినా ఈ శ్లోకంతో ప్రారంభించాలని పెద్దల వాక్కు ఏ పురాణం మొదలుపెట్టినా మొదట నారాయణుడితో ప్రారంభించాలి. ఆ తరువాత నరులలో గొప్పవాడు కావున నరుడికి నమస్కరించాలి. ఒకప్పుడు శ్రీమహావిష్ణువు నరుడు, నారాయణుడు అనే రెండు రూపాలు ధరించాడు. ఆ రూపాలలో రెండవది నరుడు. ఈ నరుడు “నరోత్తముడు” (నరంచైవ నరోత్తమమ్) అంటే మానవులలో శ్రేష్ఠుడు. అటువంటి నరునకు నమస్కారం. ఆ తరువాత సరస్వతీదేవి గురించి నమస్కరిస్తున్నాము. అష్టాదశపురాణాలు మనకు అందించిన వ్యాసునికి నమస్కరిస్తున్నాం, అని ఈ శ్లోకంతో నారాయణుని తలచుకొని, వ్యాసుడిని తలచుకొని పురాణాలు మొదలుపెట్టాలి అని చెప్పారు. సూతభగవానుడు 18 పురాణాలు, మహాభారత ఇతిహాసము, సంహితలు ఇవన్నీ ఒకప్పుడు నైమిశారణ్యంలో వివరించాడు. వివరించిన ప్రతీసారి ఈ శ్లోకంతో ప్రారంభించేవాడు. అందుకే మనము కూడా ఈ శ్లోకంతో ప్రారంభిస్తున్నాము.
గరుడ పురాణం మాహాత్మ్యము
ఈ జన్మలోనే ముక్తిని ప్రసాదించేది, అతి భయంకరమైన నరక బాధలను తొలగించేది గరుడ పురాణం. అసలు మానవజీవిత పరమార్థం అంటే ఏమిటో తెలియజేసేది గరుడపురాణం. ఇది వింటే చాలు మానవ * శరీరంలోకి అనేక దివ్యశక్తులు వస్తాయి, ఆలోచనాశక్తి పెరుగుతుంది. గరుడ పురాణాన్ని సాక్షాత్తు భగవంతుడు, శ్రీమన్నారాయణుడు గరుత్మంతునికి నీ చెప్పాడు. గరుడ పురాణం విన్న గరుత్మంతుడు దాన్ని ఒక గ్రంథంగా వ్రాసాడు. ఇం దాన్ని కశ్యపుడికి ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ పురాణం విష్ణువు ద్వారా రుద్రుడికి, బ్రహ్మకి అందింది. బ్రహ్మ ద్వారా వేదవ్యాసాదులకు ఈ పురాణం అందింది. వేదవ్యాసుడు మనకి 19 వేల శ్లోకములతో ఈ పురాణాన్ని రచించి...............