మరలనిదేల గురుచరిత్రంబన్నచో...
కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారిని ఎవరో అడిగారట, “మళ్ళీ రామాయణం రచించడం ఎందుకు, ఇప్పటికే చాలామంది రాశారుగా...?” అని. అప్పుడు వారు అన్నారు...
"మరలనిదేల రామాయణంబన్నచో
నీ ప్రపంచక మెల్లనెల్ల వేళ
దినుచున్న యన్నమే దినుచున్న దిన్నాళ్ళు
తనరుచి బతుకులు తనవిగాన
తలచిన రామునే తలచెద నేనును నా భక్తి రచనలు నావి గాన" అని.
అంటే, పక్కవాడు పరమాన్నం తిన్నాడులే అని మనం తినడం మానేయం కదా! తినేది ఒకే పరమాన్నమైనా, అతడి అనుభూతి అతనిది, మన అనుభూతి మనది.
"శ్రీ గురు చరిత్ర”ని త్వరలో ఒక చిన్న పుస్తకంగా రాయబోతున్నానండీ అని చి. పవన్ దత్త చెప్పగానే, నాకు శ్రీ విశ్వనాథవారి మాటే గుర్తుకొచ్చింది. శ్రీ నృసింహ సరస్వతీ స్వామి లీలామృతమైన గురుచరిత్ర ఎప్పుడూ ఒక్కటే, కానీ అది పారాయణ చేసినప్పుడు ఒక్కొక్కళ్ళకీ కలిగే అనుభూతి మాత్రం వేరు వేరు. అలా అతడికి కలిగిన అనుభూతిలోంచీ, భక్తి భావనలోంచి శ్రీ గురుని లీలలు మరొక్కసారి మన మధ్యకి రాబోతున్నాయి, సంతోషం!
శ్రీ గురుచరిత్రని, నిత్యపారాయణ మొదలుకొని, త్రి-సప్తాహ, ద్వి-సప్తాహ, సప్తాహ పారాయణ విధానాల్లో ఎందరో భక్తులు ఎన్నో విధాలుగా పారాయణ చేస్తూ ఉంటారు. కానీ రానురానూ హడావుడి జీవితాల్లో సప్తాహ పారాయణ కూడా గగనమైపోతున్న రోజులివి. అటువంటప్పుడు ఏ దత్త జయంతి రోజో, గురుపూర్ణిమ..............