• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sri Guruve Namah

Sri Guruve Namah By Kasina Venkateswararao

₹ 36

  1. శ్రీ గురూపాఖ్యానం 1. గురు స్వరూపం

గుకారశ్చ గుణాతీతో రూపాతీతో రుకారకః గుణరూప విహీన త్వాద్గురు రిత్యభిధీయతే

"గు" అనే అక్షరం త్రిగుణాతీతం "రు" అనే అక్షరం రూపాతీతం. అనగా సద్గురువు త్రిగుణములను జయించి స్వరూపజ్ఞాన సామర్థ్యంగల పరమాత్మ దివ్యగుణాలు, దివ్యతేజంతో ప్రకాశిస్తాడు.

గుకార్కోంధకారస్తు రుకారస్తన్నిరోధకః | అంధకార నివృత్త్యా తు గురురిత్యభిధీయతే ||

గురు శబ్దం లోని 'గు' కారం అంధకారాన్ని సూచిస్తే 'రు' కారం ఆ అంధకారాన్ని నిర్మూలించి వెలుగును ప్రసాదించే వ్యక్తి గురువు అని తెల్పుతుంది.

న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః! న గురో రధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః ||

గురువు కన్నా మిన్నయైన తత్త్వం లేదు. తపస్సు లేదు. జ్ఞానం లేదు. అట్టి శ్రీ గురువుకు నమస్కారం.

గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః || గురుర్విశ్వం న చాన్యాల స్తి తస్మై శ్రీ గురవే నమః || |

విశ్వమంతా గురువు నడుమనే యున్నది. విశ్వం మద్య గురువు ఉ న్నాడు. గురువే విశ్వం. మరొకటి లేదు. అట్టి గురువుకు నమస్కారం.

గురుర్బహ్మా గురుర్విష్ణు ర్గురుర్దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||

గురువే బ్రహ్మ. గురువే విష్ణువు. గురువే దేవుడైన మహేశ్వరుడు. గురువు సాక్షాత్తు పరబ్రహ్మము. అట్టి శ్రీగురుదేవునకు నమస్కారము.

అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే | జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః ||

పెక్కు జన్మలనుండి వచ్చిపడిన కర్మబంధాలను జ్ఞానం అనెడి అగ్ని ప్రభావంతో కాల్చివేయునట్టి గురువుకు నమస్కారం.

  • Title :Sri Guruve Namah
  • Author :Kasina Venkateswararao
  • Publisher :Gollapudi Veeraswamy Son
  • ISBN :MANIMN3398
  • Binding :Papar back
  • Published Date :2013
  • Number Of Pages :80
  • Language :Telugu
  • Availability :instock