• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sri Hanumat Pratyangira Krutya Tantram

Sri Hanumat Pratyangira Krutya Tantram By Sri Swamy Madhusudhana Saraswathi

₹ 400

ప్రత్యంగిర కృత్యా తంత్రం - ప్రయోజనాలు

  1. ప్రత్యంగిర ఉపాస ఎందుకు చేయాలి?

ప్రత్యంగిర సనాతనమైన ఋగ్వేదీయశక్తి. ఇది పరిశిష్టాలలో ఉన్నది (పరిశిష్టం అంటే మిగిలిన ముక్క అని అర్థం). కనుక ఈ శక్తిని అథర్వణ విద్యగా పేర్కొంటారు. (ఋగ్, సామ, యజుర్వేదాలలో మిగిలిన ముక్కలన్నీ కలిసి అథర్వణవేదంగా పేర్కొన బడతాయి. వేదకాలం నుండి ఈ ఉపాసన కొనసాగుతున్నది. విశ్వామిత్రాది ఋషులు ఈ శక్తిని ఉపాసిం చారు. అయితే దివ్యమైన సుదర్శన, నారాయణ, పాశుపత, బ్రహ్మ మొదలైన అస్త్రాలయొక్క పిశాచరూపం గనుక వేదమార్గవలంబులు అనుష్ఠించకూడదు. అని కొందరంటారు. కానీ నేను నా స్వీయానుభవంతో పెద్దల గురువుల అనుమతితో ఉపాశిస్తున్నాను, దీని నుండి లాభం పొందు తున్నాను. వనదుర్గను ఆత్మరక్షణ కొరకు, ప్రత్యంగిరను శత్రుసంహారం కొరకు అనుష్ఠిస్తారు. మనలోనే దాక్కొని మనలను పతనం చేసేవి, సుఖాన్ని ఇస్తున్నట్టుగా నటిస్తూ దుఃఖాన్ని ఇచ్చేవి అయిన కామం క్రోధం మొదలైన శత్రువులను సంహరించడానికి కూడా ఈ విద్య ఉపయోగపడుతుంది. కొందరుమాకు లోపలగానీ బైటగానీ శత్రువులు లేరు అన్న తరువాత ఈ విద్యను ప్రయోగిస్తే వారికి తెలియకుండానే వారికి ఉన్న శత్రువులు నశించడం మేము ఎరుగుదుము. ఈ విద్యను ధనప్రాప్తికి ఉపయోగించడం మనకు పురాణాలలో కనిపిస్తుంది. (లక్ష్మీ (మాయా) ప్రత్యంగిర) ఈ విద్యానుష్టానంలో ఆరోగ్యాన్ని పొందినవారు ఎందరో ఉన్నారు.

     2. ప్రత్యంగిర ఉపాసన ఎవరు చేయాలి?

ధనం కావలసినవారు, ఆరోగ్యాన్ని కోరుకునేవారు, అప్పుల పాలైన వారు, సంతానంలేనివారు, వివాహంకానివారు లేదా వేదవిద్యలలో శ్రద్ధ ఉన్నవారు ఎవరైనా ఈ విద్యనుపాసించవచ్చు.

  1. ప్రత్యంగిర ఉపాసన ఎప్పుడు చేయాలి? ఆయా తిథులు, వారాలు, నక్షత్రాలు వివరించండి?

ఉపాసన అంటే ఈ విద్య (శక్తి) వద్దకు వెళ్ళి కూర్చోవడం అని అర్థం. అంటే రోజూ నియమం తప్పకుండా జీవితాంతం ఉపాసించాలి. నియమం తప్పక ప్రతి అమావాస్య పౌర్ణిమలకు రాత్రి సమయంలో హవనం..................

  • Title :Sri Hanumat Pratyangira Krutya Tantram
  • Author :Sri Swamy Madhusudhana Saraswathi
  • Publisher :Mohan Publications
  • ISBN :MANIMN5812
  • Binding :Paerback
  • Published Date :2024
  • Number Of Pages :320
  • Language :Telugu
  • Availability :instock