₹ 150
జగద్గురు శ్రీ కళ్యానందభారతిమంతాచార్య మహాస్వామివారు ఎన్నో వ్యాసాలు ఆధ్యాత్మిక విషయాలమీద వ్రాసారు. అవి వివిధ పత్రికలలో ప్రచురితమైనవి. ఆ పత్రికలూ కూడా కొన్ని ఎపుడు లభించుట లేదు. అయితే మా మిత్రులు కీ||శే||చెంబ్రోలు బాలసుబ్రమణ్య శాస్త్రిగారు చాలాకాలం క్రిందట, నాకు ఆరాధన నా పత్రికలూ ఇచ్చి దానిలో శ్రీ స్వామివారి వ్యాసాలు ఉన్నావని చెప్పారు. అవి నకలు తీయించుకొని ఉంచుకున్నాను. అట్లాగే ఇంకొక మిత్రులు దివ్యవాణి పత్రికలో స్వామివారి వ్యాసాలు ఉన్నావని చెప్పి, దాని ప్రతులు నాకు ఇచ్చారు. అవి అన్ని ఒక సంకలనముగా దుర్ముఖినామ సంవస్త్ర గురుపూర్ణిమ సందర్భంలో ట్రస్ట్ పక్షాన ప్రచురిస్తే బాగుంటుందని అనిపించింది. ఆ భావమే ఏ గ్రంథ రూపం.
పాఠకుల, జగద్గురువులు అందించిన విషయాలకు భక్తితో చదివి, ఆకళింపు చేసుకొని శ్రీగురువుల, పరమేశ్వరి కటాక్షములను పొందగలరని ఆశిస్తున్నాను.
-జగద్గురు శ్రీ శ్రీ శ్రీ కల్యానంద భారతి మంతాచార్య మహాస్వామి.