కొత్త తరానికి కొవ్వలి
భగవంతుడు కలలో కనిపించి కావ్యాలు రాయించారని, రాయించుకున్నాడని పూర్వకవులు ఎందరో ప్రస్తావించారు. అందుకు సాక్ష్యం ఉండదు. కానీ వారి కావ్యం చదివినప్పుడు అది నిజమేననిపిస్తుంది. భగవత్ తత్వం ఆ కావ్యంలో స్పష్టంగా కనిపిస్తుంది. పద్యమైనా, గద్యమైనా పలికించినది రామభద్రుడు అన్నది నిజ
సరిగ్గా అదే భావం 'నవలా సాహిత్య సార్వభౌముని' విషయంలో జరిగింది తమ వారి ప్రతిభను అనుకోవాలి. తెలుగు వారికున్న బలహీనతల్లో ఒకటి - గుర్తించకపోవడం, పొరుగింటి పుల్ల కూరలను నెత్తిన పెట్టుకోవడం. తమ సాహిత్య 3 ప్రతిభామూర్తులు తగిన స్థానం యిచ్చి స్మరించుకోలేక పోతున్న జాతి బహుశా తెలుగు జాతి మాత్రమే ఏమో!
లేకుంటే 1001 నవలలు రాసిన కొవ్వలిని మరిచి పోవటం ఏమిటి! ప్రపంచ సాహిత్యంలో మరే భాషలో, మరే రచయిత చేయలేని నవలా సృష్టి చేసిన వారిని నిత్య స్మరణీయుడిగా నెత్తి మీద పెట్టుకోవాలి కదా! అలా మరుగున పడటం వల్ల ఆయనకు పోయేదేమీ లేదు. కానీ అటువంటి ప్రతిభా మూర్తిని వదులుకున్న వారిగా మనం మిగిలిన భాషల వారి ముందు తేలిపోతాం.
కానీ తెలుగు తల్లి తన మానస పుత్రుడు పేరు మరుగున పడటం తట్టుకోలేక, సుశీలమ్మ గారిని తట్టిలేపి, కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారి గురించి కొత్త తరానికి తెలియచెప్పే బాధ్యత అప్పగించిందేమో !
చలం, శ్రీశ్రీ లాంటి వారికి అభిమాన బృందం ఉండి, వారి పేరును వారి తర్వాత కూడా నిలబెట్టింది. కాని వారి సమకాలికుడుగా, గొప్పగా స్త్రీ సమస్యల................