గణపతి హోమమ్
గణపతి పూజ అనుష్ఠానం హోమమ్ ఉపయోగాలు
మొత్తం గణపతి మంత్రములను ఉపయోగించి (అనగా మంత్రజపంచేసి, హోమమ్ చేసి, తర్పణం, అభిషేకం చేసి లేదా మంత్రముతో స్వామివారి ఆరాధనచేసిన, పూజచేసిన). మనకు కావలసిన ధర్మబద్ధమైన కోరికలు కామ్యాకామ్యాలు నెరవేర్చుకోవచ్చు. అనంతమైన శక్తి ఈ మంత్రములలో దాగివుంది. మనం భక్తితో చేస్తే తప్పక సాధించగలము.
ఏ మంత్రము జపంచేసినా దీర్ఘకాలం సాధనగా, ఉపాసనగా మరియు అనుష్ఠానంగా చేసినా లేదా గృహములో పూజగా చేసిన ఖచ్చితంగా అనుకున్న కోరికలు నెరవేరును శుభఫలితాలు కలుగును.
గమనిక: కాని 'కక్షతో’-కుట్రతో - ఈర్ష్యతో కావాలని ఇతరులను గాని ధర్మపరులనుగాని, మంచివారిని కానీ, గురువులను కానీ, స్వామివారి భక్తులను గానీ, ఇబ్బంది పెట్టాలని చేస్తే తిరిగి బెడిసికోడుతుంది. అనగా విఫలమవడమే గాక ఇబ్బందులు కలుగును. ఇది తథ్యమ్.
కావున గణపతి మంత్రమ్-హోమమ్-సాధన-పూజ మొదలైనవి చేసేటప్పుడు ధర్మబుద్ధితో లోకహితం కోసం అనగా మనకు, మన కుటుంబానికి అనగా జీవితభాగస్వామికి, పిల్లలకు, మనుమలకు, మనుమరాలకు, మరియు మన వారసులందరికీ మరియు ఈ లోకంలో ఉండే సజ్జనులకు, ఇతర భక్తులకు, గురువులకు, సర్వజీవులకు శుభం కలగాలని, మోక్షం కలగాలనీ- ముఖ్యంగా మనకు ధనం, ధాన్యం, స్వర్ణం, ఆరోగ్యం, విద్యాయోగం, గృహయోగం, సంతానయోగం, సౌభాగ్యయోగం, ఉద్యోగయోగం, వంశాభివృద్ధియోగం, కీర్తిప్రతిష్ట, ఆకర్షణశక్తియోగం, సర్వాభీష్టసిద్ధియోగం కలగాలని గణపతి పూజ, హోమమ్, సాధన చేయడం శుభధయకం.
మనకు నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలు, దీర్ఘకాలికంగా ఉన్న సర్వశ్రతు భాదలు అనగా ప్రక్కనే ఉండి వెన్నుపోటు పోడిచేవాళ్ళను,.............................