• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sri Mahabharathamu

Sri Mahabharathamu By Acharya Yarlagadda Balagangadhararao

₹ 300

శ్రీ మహాగణాధిపతయే నమః
 

శ్రీ మహాభారతము - వచనము - విశేషవ్యాఖ్య

ఆనుశాసనిక పర్వము - మొదటి ఆశ్వాసము

దేవా! వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీ మహాభారత అనంతర వృత్తాంతాన్ని వినిపించసాగాడు. దివ్యజ్ఞానంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న భీష్మ మహాశయుడు వివిధ ధర్మాలను వినిపింపగా విన్న ధర్మరాజు సభక్తికంగా ఆయన పాదాలకు నమస్కరించి, వినయంతో చేతులు మోడ్చి మహానుభావా! నాయందలి అపారమైన దయతో సకల ధర్మాలూ వివరించావు. అయినా నా మనస్సు శాంతి పొందుకున్నది. కోపాన్ని పూని బంధువులనెందరినో సంహరించాను. అదంతా ఒక ఎత్తు. కాగా నీకు కలిగించిన ఈ ఘోర స్థితి ఒక ఎత్తు. ఇవన్నీ నా మనస్సును కలచి వేస్తున్నాయి. ఇక నా మనసుకు స్వస్థత ఎలా చేకూరుతుంది. నేను చేయగలిగిందేమో బోధపడటం లేదు. దుర్యోధనుడు పరమ లోభత్వంతో మాతో కలిసి మనుగడ సాగించటానికి ఇష్టపడ్డాడు. కాదు. పోనీ నేనైనా, రాజ్య అంతటినీ ఆయనకే వదలివేయవచ్చును కదా! ఆపని నేనూ చేయలేదుకదా! కేవలం మా ఇరువురి పంతాల వల్లనే ఇంత అనర్థం కలిగింది. ఏ విధంగానూ ఈ పశ్చాత్తాపం నన్ను వదలకుండా వుంది. ఏం దారి అంటూ దుఃఖపడ్డాడు. గౌతమీ లుబ్ధక సర్పమృత్యుకాల సంవాదము

ధర్మరాజు అలా దుఃఖపడుతూ అన్నదంతా విన్న భీష్ముడు, ధర్మరాజా! ఎవడిని చంపటానికీ మానవుడు కర్త కానేకాడు. నీకో ఇతిహాసం చెపుతాను. విను అంటూ ఇలా చెప్పసాగాడు. గౌతమి అనే శాంత స్వభావురాలైన బ్రాహ్మణ స్త్రీ ఒకామె ఉండేది. ఒకనాడు ఆమె కుమారుడు పాముకాటుతో మరణించాడు. ఆమె దుఃఖిస్తూ వుండగా, ఒక కిరాతుడు కాటు వేసిన ఆ పామును తాడుతో కట్టి ఆమె వద్దకు తెచ్చి దానిని చూపి, ఇదే నీ బిడ్డను కాటు వేసింది. దీని తలను కఱ్ఱతో నుజ్జు నుజ్జుగా కొట్టిగాని, కత్తితో రెండు ముక్కలు చేసిగాని చంపేస్తాను. ఎలా చేయమంటావో చెప్పు అంటూ ఆ పాముపై నిండా కోపించి అన్నాడు.

అంతట ఆమె కిరాతునితో, అన్నా! దీనిని చంపకు విడిచిపెట్టు అనగా, అదేమిటి! అలాగ అంటావు. నీ బిడ్డ ప్రాణాలు తీసింది ఇదే! దీన్ని చంపి తీరుతాను ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు........................

  • Title :Sri Mahabharathamu
  • Author :Acharya Yarlagadda Balagangadhararao
  • Publisher :Nirmala Publications
  • ISBN :MANIMN5770
  • Binding :Papar Back
  • Published Date :Dec, 2013
  • Number Of Pages :267
  • Language :Telugu
  • Availability :instock