శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ మహాభారతము - వచనము - విశేషవ్యాఖ్య
కర్ణపర్వము - మొదటి ఆశ్వాసము
దేవా! శ్రీ మహాభారత అనంతర వృత్తాంతాన్ని వైశంపాయనుడు జనమేజయునికి చెప్పసాగాడు. గొప్ప తెలివిగల సంజయుడు యుద్ధ రంగం నుండి హస్తినాపురానికి వచ్చి, ధృతరాష్ట్రుడున్న మందిరంలోనికి వెళ్ళి ఆయనను చూసి నమస్కరించాడు. ధృతరాష్ట్రుడు అతనిని ఆదరించి కూర్చోమని చెప్పగా ఆయనకు సమీపంలో ఆసీనుడై మహారాజా! మీ వద్ద నుండి శెలవుపొంది యుద్ధరంగానికి వెళ్ళి జరిగిన రెండు దినాల్లో జరిగిన యుద్ధ క్రమాన్ని చూసి వచ్చాను అని చెప్పి మహారాజా! కర్ణుడు ఎలా యుద్ధం చేశాడో ఏమని చెప్పేది! అంత గొప్పగా వుంది. ఆయన పరాక్రమించిన తీరు అంటూ కర్ణుని ప్రశంసిస్తూ ఆహా! యుద్ధంలో కర్ణుడు, మొదలు పాండవ సైన్నాన్ని ఒక లెక్కలోకే తీసుకోలేదంటే నమ్ము. గడ్డిపోచ క్రింద కట్టివేశాడు. ఆయన ధాటికి కూలిపొయినంత కాల్బలం కూలిపోయింది. రథాలు విరిగిపోయాయి. ఎనుగులు, గుఱ్ఱాలు నాశనమైపోయాయి. ఒక లోకంగాదు, ఒక పాడు గాదు. చచ్చేవారు చస్తుంటే, పారిపోయేవారు పారిపోయారు. ఆయన పరాక్రమించిన తీరును చూసి దేవతలే ముక్కున వేలేసుకున్నారంటే ఇతరులను గూర్చి చెప్పేపనేముంది గనుక! అయితేమాత్రం ప్రయోజనమేముంది. తన మనోవ్యధకు కారకుడైన అర్జునుని బాహుపరాక్రమం ముందు నిలువలేక, పెద్దపులి ముందు నిలువలేని ఆబోతు వలె సమసిపోయాడు. అలా పాండవుల కసి తీరిపోయింది.
అని అంటూ కర్ణుడు తలపుకు రాగా దుఃఖించసాగాడు. కొంతసేపటికి సంబాళించుకుని, దీర్ఘంగా నిట్టూరుస్తూ, దుఃఖంతో పూడుకుపోయిన గొంతుతో మహారాజా! అతడు ఒక్కడే అన్నమాటేమిటి! కౌరవులు జయిస్తారన్న ఆశే ఇంకిపోయిందనుకో! ఏమంటావా, ఆయనున్నాడు గదా అతడే ఆ మహాబలవంతుడు భీముడు. అతడు మన దుశ్శాసనుని రొమ్ము చీల్చి నెత్తురు త్రాగాడు. అయిపోయింది. అంతా అయిపోయింది. ఇంకేముంది చెప్పుకోవటానికి. అయినా, ఇది ఇలాగవుతుందని కావలసిన మన వాళ్ళందరూ ముందు ఎన్నోసార్లు ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు...............