• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sri Matbhagavatha Dashamaskandamu

Sri Matbhagavatha Dashamaskandamu By Srimati Tammina Paramatma

₹ 300

శ్రీ మాత్రే నమః

రమ్యాతి రమ్యం - రగడ భాగవతం

'కాశీకవి' "అసమాన అవధాన సార్వభౌను".

డా ॥ శ్యామలానందప్రసాద్.

శ్రీమతి తమ్మిన పరామా

తామృత లేఖిని ముఖమున ఆవిర్భావ

మ్మై మన రగడల సొగసున

స్వామికి లభియించె భాగవత మద్భుతమై।

'వింటే భారత వినాలి - తింటే గారెలే తినాలి' అనే తెలుగుసామెత వినడం వరకూ, తెలుగువారికి భారతమే ఇష్టమన్నట్టు - పోతనగారికి ముందు ఏర్పడి వుంటుంది. పోతన మహాకవి 'భాగవతం వ్రాసిన తరువాత, పల్లెపల్లెలో 'భాగవతం' నిత్యపారాయణ గ్రంధంగా, నిరక్షరాస్యులకు కూడా, భాగవత పద్యాలు కంఠస్థమైనాయి. మాటల మధ్యలో, వాడుకలోకి కూడా వచ్చేశాయి. బాలకృష్ణుని కథలు, ఆ బాలగోపాలాన్నీ ఆకట్టుకున్నాయి. "చేతవెన్నముద్ద” పద్యంతోనే తెలుగుపిల్లల ముద్దుమాటలు మొదలైనాయి. 'కూచిపూడివారు' హరికథకులు భాగవతులనిపించుకొని ధన్యులయ్యారు. యక్షగానాలూ, భామాకలాపాలూ, హరికథలూ, నాటకాలూ, తెలుగు సంస్కృతిలో, ముఖ్యభూమికను పోషిస్తున్నాయి. సంగీతం, సాహిత్యం, నాట్యం, వాటన్నిటికీ, భాగవతమే ఆధారం. తెలుగువారి - చిత్రలేఖనం, శిల్పం, అన్నీ శ్రీకృష్ణ పరమాత్మతో పెనవేసుకున్నాయి. సంస్కృతంలో పరమాద్భుతంగా, "శ్రీ కృష్ణ లీలా తరంగిణి" రచించిన, నారాయణ తీర్థులవారు కూడా తెలుగువారే. ఇది భాగవతంతో తెలుగువారి అనుబంధం.

తెలుగు సాహిత్యంలోకి, సంస్కృత భాషలో నుండి, ఎన్నో ఛందస్సులు దిగుమతి అయ్యాయి - ఎంతో ప్రసిద్ధి చెందాయి. “ఆటవెలది, తేటగీతి, ద్విపదవంటి, దేశీ ఛందస్సులు కూడా సుప్రసిద్ధమైనాయి. కానీ - వాటి కంటే ముందే ప్రాఙ్నన్నయ యుగంనాటి, శాసనాలలో కూడా, కనిపించే తెలుగు ఛందస్సు “రగడ”. ఇది గేయాత్మకమైన 'మాత్రా ఛందస్సు. “ఆదికవి నన్నయ్యగారు" ప్రత్యక్షంగా దీనిని, 'రగడ' పేరుతో ఉపయోగించక పోయినా - 'తరువోజ' మున్నగు పేర్లతో పరిచయం చేశారు. నన్నయగారి తరువాత, తెలుగు కవులు, కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఈ రగడల ఛందస్పును ఉపయోగించారు. 'పింగళిసూరన కళాపూర్ణోదయంలో 'రగడ రామాయణం' రాశాడు...................

  • Title :Sri Matbhagavatha Dashamaskandamu
  • Author :Srimati Tammina Paramatma
  • Publisher :Andhra Pradesh Rastra Srujanatmakata & Samsruthi Samity
  • ISBN :MANIMN5102
  • Binding :Papar Back
  • Published Date :2019 first print
  • Number Of Pages :254
  • Language :Telugu
  • Availability :instock