శ్రీ నాగరాజ సమేత భవానీశంకర స్వామి దేవాలయ దివ్య చరిత్ర - వచనం
కాకతాళీయంగా
అమరారామ శ్రీ బాలచాముండి
సమేత అమరలింగేశ్వర ఆశీర్వాదం
శ్రీ స్వామి వారి ఈ గ్రామదేవాలయ చరిత్ర పుస్తక రచన తరువాత ప్రతులను తీసుకొని స్వామి వారి కళ్యాణం రోజున ఈ గ్రామంలోని దేవాలయ ప్రాంగణంలో మొదటిసారిగా భక్తులకు వితరణ చేయాలి అన్న ఆలోచనతో బయలుదేరటం, మార్గ మధ్యలో గుంటూరులో విడిది చేయటం జరిగింది. అనుకోని విధంగా అక్కడ వున్న వాళ్ళ ప్రేరణ మేరకు [ అప్పటికి ఈ పుస్తక ప్రచురణ విషయం ఎవరికీ తెలియజేయలేదు ) మేము మొదటిసారిగా అమరావతి పుణ్య క్షేత్రం అమరారామ అమరలింగేశ్వర స్వామి దర్శనానికి వెళ్లడం తటస్థించింది. మధ్యాహ్యం 12గం సమయం కావడం వలన లోపలికి వెళ్లి పుస్తక ప్రతులను పూజలో ఉంచాలని అభిషేకం లేదా కుంకుమార్చన ప్రవేశ చీటీ కోసం వెతికాము. ఆ పూజలో దంపతులు మాత్రమే కూర్చోవాలని మరియు సమయాభావం అవటం వలన ప్రవేశ చీటీలు (టికెట్) ఆపివేశామని చెప్పారు. ఇంక చేసేది. లేక దర్శనం కోసం సర్వ దర్శన వరుసలో నిలబడి లోనికి వెళ్లడం అయింది. స్వామివారి గర్భాలయ ద్వారం వద్దకు వెళ్లి నమస్కారం చేసేప్పుడు ఆ ఆలయ పూజారులు స్వయంగా తామే మా చేతిలో ఉన్న పుస్తక ప్రతి చూడటం, వివరం అడిగి తెల్సుకొని, గర్భ గుడిలోని అమరలింగేశ్వర స్వామికి, బాలచాముండి దేవికి ఆ పుస్తకం తాకించి పూజ పుష్పాలను ఇవ్వటం జరిగింది. రద్దీ కల క్షేత్రంలో ప్రవేశద్వారం వద్ద ఆటంకం ఏర్పడినా కూడా లోపలికి వెళ్లగానే పూజారులు పూజ, అశీర్వచనం ఇవ్వడం స్వామివారి లీలే అని ఆనందించాము...........................