శ్రీరస్తు
పరాశర స్మృతి
ఆచారకాండము
ప్రథమాధ్యాయము
శ్లో॥ అథాతోహిమశైలాగ్రే దేవదారు వనాలయే
వ్యాసమేకాగ్రమాసీన మపృచ్ఛనృషయఃపురా
మానుషాణాంహితంధర్మం వర్తమానే కలౌయుగే
శౌచాచారం యథావచ్చ వద సత్యవతీసుత.
పూర్వకాలమునందు మహర్షులు హివత్పర్వత శిఖరము నందున్న దేవదారు వన గృహంబున ఏకాగ్రచిత్తుడయి కూర్చుండి యున్న వ్యాసమహర్షి సమీపమునకుపోయి “ఓ సాత్యవతేయా! ఈ కలియుగమునందు మనుష్యులకు మేలుసలుపునట్టి శౌచము ఆచారము (మున్నుగాగల) ధర్మమును పూర్ణముగ తెలుపుమని అడిగిరి.
శ్లో॥ తత్వామునివాక్యంతు సశిష్యోగ్న్యర్కసన్నిభః
ప్రత్యువాచ మహాతేజాశ్రుతి స్మృతివిశారదః||
నచాహం సర్వతత్త్వజ్ఞః కథం ధర్మం వదామ్యహమ్ |
అస్మత్పితైన ప్రష్టవ్య ఇతి వ్యాసస్సుతో బ్రవీత్ ॥
శిష్యసమూహముతో కూడుకొనియున్నవాడును, అగ్నిసూర్యుల యొక్క తేజస్సుతో సమానమైన బ్రహ్మవర్చస్సు గలవాడును, వేద ములు, ధర్మశాస్త్రములు వీనిని చక్కగా నెరింగినవాడున్ను అగు వ్యాస మహర్షి మహర్షులు పలికిన పై వాక్యమును విని "నేను సకల ధర్మ ములనెరుంగను, కావున మీరడిగిన కలి ధర్మముల నెట్లు చెప్పగలను? మా తండ్రినే అడుగుడు" అని బదులు చెప్పెను.................