• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sri Pardhivalingarchana Kalpadruvamu

Sri Pardhivalingarchana Kalpadruvamu By Brahmasri Puranam Maheswara Sharma Garu

₹ 360

శ్రీ పార్థివ లింగార్చనా కల్పద్రుమము

మహాదేవ

మానవజన్మ కేవలం మోక్షసాధనకైయే వచ్చినది. ముక్తిని పొందాలంటే ఎన్నో ప్రతిబంధకాలు అందులో పాపాలు, అజ్ఞానము, మోహము, అహంకారమమకారాలు మొదలయినవి. ఇవి తొలగిపోతే గానీ ముక్తి కరతలామలకముగాదు. ఇవి తొలగాలంటే ఎన్నో జన్మలెత్తాలి. కానీ సులభోపాయమొకటి ఉన్నది అది శివలింగార్చననే -

"ఉదృత్యాద్య భుజద్వయం నిగదితం లింగార్చనం కేవలం మోక్షోపాయత శృతం శృతిశతైః తేనైవ ముక్తిః పరా” శివుడు పార్వతికి చెప్పుచున్నాడు. ఓ పార్వతీ! రెండు చేతులెత్తి చెప్పుచున్నాను. కేవలం లింగార్చననే మోక్షానికి కారణం వందలాది శృతులు ఈ విషయాన్ని చెప్పుచున్నాయి. అని “శివరహస్యం”లో శివుడు పార్వతికి చెప్పిన సంవాదము అత్యద్భుతముగా వున్నది. ఒకవేళ నరజన్మ వచ్చిన తరువాత లేలేత బిల్వదళాలు మల్లెమాల విభూతి రుద్రాక్షలతో పూజించిన శివలింగాన్ని కనుక దర్శించలేదంటే “తరవే క్షణహీన జన్మ హీనం నరకావాస నివాసభూతం "వాని జన్మ హీనజన్మ వాడు తప్పక నరకంలో నివసిస్తాడు. " లింగాలయం పశ్యతి యః ప్రయత్నతస్తమేవ దృష్ట్వా సయమోతి భక్త్యా లింగాన్ని పూజించే ఇల్లును చూస్తేనే చాలు యముడు నా జీవితము ధన్యమైనదని భావిస్తాడు అని దీని అర్థము.

"ప్రాతఃకాలే శివం దృష్ట్వా నిశీపాపం వినశ్యతి" అనెడి ప్రసిద్ధ శ్లోకములే వ్యాసరచితాలు. ప్రాతః కాలం శివలింగదర్శనం రాత్రి పాపాన్ని నశింపచేస్తుంది. మధ్యాహ్న శివలింగ దర్శనం జన్మ నుండి చేసిన పాపాలను నశింపచేస్తుంది. సాయహ్న శివలింగ దర్శనం సప్తజన్మలలోని పాపాలను నశింపచేస్తుంది అను వాక్యాలు అర్థవాదాలు కావు నిత్య సత్యాలు: .......................

  • Title :Sri Pardhivalingarchana Kalpadruvamu
  • Author :Brahmasri Puranam Maheswara Sharma Garu
  • Publisher :Sri Mahalingarchana Seva Parishat
  • ISBN :MANIMN4090
  • Binding :Papar back
  • Published Date :2023 2nt print
  • Number Of Pages :382
  • Language :Telugu
  • Availability :instock