• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Sri Ramana Tatvam

Sri Ramana Tatvam By Dr Maddali Subbarao

₹ 150

గురువు

ఆత్మ సాక్షాత్కారమునకై గుర్వనుగ్రహము

ఈ సాక్షాత్కరము కావలసినది ఎవరికి? అని విచారింపగా ప్రత్యేక వ్యక్తిత్వము నశించి, ఇంక అతను సాక్షాత్కరింపవలయునను భ్రమను వీడును. ఇదియే గుర్వనుగ్రహము.

ఆత్మ యింకనూ సాక్షాత్కరింపలేదు అను భ్రమను వదిలించుటయే గాని, ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించుట గురువునకే గాదు, ఈశ్వరునకు గూడ సాధ్యము కాదు. అట్లు ప్రసాదింపుమని కోరుట నన్ను నాకు నిమ్మని యడిగినట్లు. దేహాత్మ బుద్ధి వలన నేను ప్రత్యేక వ్యక్తిని అను భ్రమ ఉండుటచే గురువు నాకన్న వేరుగు నొక వ్యక్తి అను భ్రమ కలుగుచున్నది. నిక్కముగా గురువు ఆత్మకన్న వేరుగాదు.

శ్రీరమణ మహర్షి తాను ఎవరికిని గురువును కాననేవారు. అందువలనే తనకు ఎవరును శిష్యులు కాదనే వారు. నిర్మలమైన అద్వైత స్థితిలో ద్వయీభావము శూన్యము. గురుశిష్యుల ప్రసక్తే రాదు. ఆ విధముగానే

వారు నడుచుకొనేవారు.

వారు తిరువణ్ణామలైలో 54 సంవత్సరములు గడిపిరి గానీ తన దేహమునకు ఏ విధముగా సంస్కారము చేయవలెనో, ఎక్కడ సమాధి చేయవలెనో తెలుపలేదు. వారి మమతారాహిత్యము అంత పరిపూర్ణమైనది.

జిజ్ఞాసువు అష్టసిద్ధుల విషయమున జాగ్రత్తబడవలయును, జ్ఞానము కోరువానిని అష్టసిద్ధులు తమంతట వచ్చి వేడిననూ అతడు వాటిని

నిరాకరింపవలెను.

గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

గురువు మనము పూజించు త్రిమూర్తుల స్వరూపమే. గురువు, బ్రహ్మవలె.........

  • Title :Sri Ramana Tatvam
  • Author :Dr Maddali Subbarao
  • Publisher :Kinnera Publications
  • ISBN :MANIMN3773
  • Binding :Papar back
  • Published Date :March, 2022
  • Number Of Pages :118
  • Language :Telugu
  • Availability :instock