శ్రీరస్తు శుభమస్తు
శ్రీ రామాంజనేయయుద్ధం
ప్రార్థన:
కల్యాణాద్భుతగాత్రాయ కామితార్ధ ప్రదాయి శ్రీ మద్వేంకటనాధాయ శ్రీనివాసాయతేనమః ॥
1 వ రంగం
స్థలం : సరయూతీరము
సమయం : ప్రభాతం
(సంకీర్తన జేయుచు నారదుడు)
నేడు గదా రామరాజ్యమున శాంతిమయ వసుధైక ప్రభుత్వం స్థాపించబడినది! సర్వేజనా సుఖినోభవంతుగా, శృతి, స్మృతి, నీతి నియమ బద్ధులై భూలోకవాసులు తమ నిత్యకృత్యముల యధావిధిగా నిర్వర్తించుచుండిరి. ఇట్టి ఏకైక ప్రపంచశాంతి సామ్రాజ్య స్థాపనకు ముందు యుగములలో ఏ మహాత్ముడో ఉద్భవించి కృషిచేసినవేమో గాని, ధర్మం తారుమారు కాకుండునా? నభూతో నభవిష్యతిగా రామరాజ్యము ప్రజా రాజ్యమగుటచే చక్రవర్తికి, సామాన్యునకు అంతరాంతర భేదములు లేక సమాన పౌరసత్వ ప్రతిపత్తితో సమిష్టి కుటుంబీకులవలె, ప్రజలు సుభిక్షముగా జీవయాత్ర సలుపుచున్నారు. ఇట్టి యెడ భూలోకమునకు వచ్చితినన్న మాటయే గాని కలహ భోక్తయగు నాకు గ్రామసంచారమే గాని, కడుపునిండా భోజనమునకు మాత్రము కాటకము వచ్చినది. నైమిశారణ్యమునగాని, దండ కారణ్యమునగాని, బ్రహ్మనదీ ప్రాంతమునగాని, యెచ్చట కేగినను ఉపవాసములే శరణ్యము లగుచున్నవి. యెట్టి దుర్దినములు కాకున్న నా ప్రయత్నము ఇటు వ్యర్ధములగునా?.............