• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Sri Ramudi Dharmapadham

Sri Ramudi Dharmapadham By Simhaprasad

₹ 250

శ్రీరాముడి ధర్మపథం (వాల్మీకి రామాయణం ఆధారంగా)

  1. ధర్మస్వరూపుడు శ్రీరాముడు

శ్రీరాముడు మాయలు చేయలేదు. మహిమలు చూపలేదు. మంత్రాలు పఠించలేదు. వరాలు ఇవ్వలేదు. లీలలు ప్రదర్శించలేదు. విశ్వరూపం అసలే ప్రకటించలేదు.

మానవుడిగా పుట్టినందుకు మనిషి పడే సుఖదు:ఖాలు, ఉద్వేగాలు, ఆనందాలు, ఆవేదనలు, విరహాలు, వియోగాలు, విలాపాలు అన్నీ అనుభవించాడు. నిజానికి అధికంగానే దుఃఖపడ్డాడు.

ఎప్పటి త్రేతాయుగం! ఎప్పటి వాడు రాముడు!

యుగాలు దొర్లిపోయినా ఇప్పటికీ భారతీయుల గుండెల్లో కొలువై ఉన్నాడు. దేవుడిగా పూజలు అందుకుంటూనే ఉన్నాడు. మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగునా

రాముడే. ఇదెలా సాధ్యమైంది? ఇంత అసాధారణత, అంత మహిమాన్యత ఎలా వచ్చింది? ధర్మానికి కర్త, కర్మ, క్రియ శ్రీరాముడే గనుక!

అలాగని ధర్మ ప్రవచనం చేయలేదు, ఆచరించి చూపించాడు!

ధర్మం అన్నా, సత్యం అన్నా, మరే సుగుణం వూసెత్తినా గుర్తుకొచ్చేది శ్రీరాముడే. ఒక కొడుకు, ఒక భర్త, ఒక సోదరుడు, ఒక స్నేహితుడు, ఒక పాలకుడు, ఒక శిష్యుడు, ఒక రక్షకుడు ఎలా ఉండాలో చేతలతో ఉపదేశించాడు!

వ్యక్తిధర్మం, కుటుంబధర్మం, సమాజ ధర్మం, రాజధర్మం - ఇలా అన్ని ధర్మాలనూ ఆదర్శకరంగా ఆచరణలో ప్రదర్శించాడు!

సామాజిక అభ్యున్నతికి, విశ్వశాంతికి ధర్మమే ఏకైక మార్గమని నమ్మి ఆచరించాడు. అందుకనే లోకాభిరాముడయ్యాడు. ఆనంద కారకుడయ్యాడు. జగత్ ప్రియుడయ్యాడు. జగదభిరాముడయ్యాడు!

త్రేతాయుగంలో రాముడు తన ధర్మాచరణ ద్వారా ప్రజల్ని ప్రభావితం చేశాడు. అనంతరకాలంలోనూ చేశాడు. నేటికీ చేస్తూనే ఉన్నాడు! రేపూ చేస్తూనే వుంటాడు.................

  • Title :Sri Ramudi Dharmapadham
  • Author :Simhaprasad
  • Publisher :Navodaya Book House
  • ISBN :MANIMN4524
  • Binding :Hard binding
  • Published Date :March, 2023
  • Number Of Pages :341
  • Language :Telugu
  • Availability :instock