శ్రీ ప్రబోధసుధాకరము ప్రకాశకుల ప్రకటనము
ఈ గ్రంథమందుఁ బ్రధానమగు విషయము శ్రీశంకర - భగవత్పాద విరచితం బగు “ప్రబోధసుధాకరం”బను భక్తి కావ్యము. ఇం దాచార్యులవారు సగుణ నిర్గుణభక్తుల కైక్యము నిరూపించియుండుటచే నిది గొప్ప సమన్వయశాస్త్రమన వచ్చును. శ్రీమద్భాగవత ప్రతిపాదితమైన కృష్ణత త్వము కర తలామలకముగాఁ బ్రబోధసుధాకరంబునఁబ్రతిపాదింపఁబడినది. అద్వైతము గురు దేవభక్తిసాధ్య మని యింత లలితముగా `నెందును నిరూపింపఁబడ లేదు.
కీ. శే. మహాలక్ష్మీ సుంద రాంబగా రీ గ్రంథరాజమును సుకుమారబుద్ధులకు శ్రద్ధాభక్తియుక్తులగు ముద్దలకుఁ దారక ముగా నెంచి యథామతిఁ జక్కని త్రిలింగ పద బంధమునఁ గూర్చిరి. ఆంధ్ర దేశమున నాచార్యుల వారి ఖండ గ్రంథములంతగా బ్రచారములో లేవు. వివేక చూడామణిమాత్రము సువిదితముగా నున్నది. ప్రశ్నోత్తరరత్నమాలయు గీర్వాణవ్యాఖ్యతో నాంధ్రవివరణముతోఁ గొంత ప్రచారములో నున్నది. వాదోప వాదములతో నిండిన భాష్యగ్రంథములు పండితులకుఁ బ్రమోద ప్రదములైనను శంకరులవారి ఖండ గ్రంథములు భ క్తబృంద మునకుఁ గైవల్యనవనీతఖండములై విలసిల్లు. శ్రీ సుందరాంబ శాంకరఖండర్గ్రంథముల నన్నింటినిఁ లింగ భాషలోని కనువ.................