• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sri Soundarya Lahari

Sri Soundarya Lahari By Andhra Sishuvu

₹ 200

సౌందర్యలహరి 'శివదూతీ'- అధ్యయనం..

ప్రణతి

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావుగారు మొన్ననే లలితా సహస్రానికి వ్యాఖ్యానం వ్రాశారు. నేడు సౌందర్యలహరీ సౌందర్య గరిమను వెలార్చారు. రేపు సుబ్రహ్మణ్య సహస్రానికి వ్యాఖ్యానాన్ని ముద్రింప సిద్ధపడుతున్నారు. అధ్యతన కాలంలో ఆంధ్ర పండిత ప్రకాండుల్లో ఇలాంటి గ్రంథాల్ని సాధికారికంగా వ్రాయదగినవారు మృగ్యమన్నా అది అత్యుక్తి కాదు.

వారి సమన్వయం మిక్కిలి శాస్త్రీయం. మోడరన్ సైకాలజి, భౌతిక శాస్త్రం, పాశ్చాత్య పండితుల భావజాలం మున్నగువాటితో నిండి ఉంటుంది. రామకృష్ణ. పరమ హంస, వివేకానందుడు, అరవిందుడు, రమణమహర్షి, శిరిడిబాబా, కంచి పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి, అభినవగుప్తపాదులు, శివానందమూర్తి, విశ్వనాథ సత్యనారాయణ మొదలగువారి వాక్యాలు ఉపబలకంగా సాగుతుంది. ఎంతటి సంక్లిష్ట తాత్విక విషయాల్ని అయినా పై వారి సాదాసీదా మాటలతో తేటతెల్లం చేస్తారు.

సౌందర్యలహరిని వ్యాఖ్యానించడానికి ముందుగా శ్రీరామకృష్ణపరమహంస వారు జగతికి ప్రసాదించిన శారదామాతను గూర్చి విపులంగా వివరించారు. జగన్మాత పార్వతీదేవే ఈ శారదామాత అని ఆమె అపారకరుణ మనల్ని రక్షిస్తుందని ఒత్తూరు ఉన్ని నంబూద్రిపాద్ మహనీయుడు ఆకాంక్షించిన తీరును ఆభక్తకవి ఆర్తిని ఆవిష్కరించారు.

జగద్గురువులు శంకరులు ఎంతటి శాస్త్రకారులో అంతటి కవులు కూడా. వారి ఆపారమైన మేధ ప్రస్థాన త్రయం వ్రాసి అద్వైతస్థాపనకు ఉపకరణమయ్యింది. వారి పేశల హృదయం శివానందలహరి, సౌందర్యలహరి, మనీషా పంచకం. కనకధారాస్తవం, భజగోవిందం మున్నగువాటిలో కవితా సౌరభాన్ని విరజిమ్మింది.

ఈ సౌందర్యలహరిలో అమ్మవారి అపారమైన కరుణతోపాటు ఆమె అనుపమ సౌందర్యాన్ని శిఖనఖపర్యంతం వర్ణించారు. మకుటం నుంచి నఖాలవరకూ ఉన్నతాలైన ఉపమానాలను ఎన్నింటినో అతఃకరించిన అంగసౌభాగ్యం వ్యక్తంగా అవ్యక్తంగా నిరూపితం. చెప్పి చెప్పి తుదకు నేను నీ విద్యార్థిని. లత్తుక పూసిన నీపాదలు కడిగిన.............

  • Title :Sri Soundarya Lahari
  • Author :Andhra Sishuvu
  • Publisher :M V Ramanareddy
  • ISBN :MANIMN4981
  • Binding :Papar back
  • Published Date :2021 first print
  • Number Of Pages :194
  • Language :Telugu
  • Availability :instock