శ్రీ శంకర భగవత్పాద కృత
శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రమ్
సదా బాలరూపాపి విఘ్నాద్రిహస్త్రీ
మహాదన్తివక్రాపి పంచాస్య మాన్యా
విధీన్దాదిమృగ్యా గణేశాభిధా మే
విధత్తాం శ్రియం కాపి కల్యాణమూర్తిః ॥
ఎల్లపుడు బాల రూపమున నున్నను, విఘ్నపర్వతముల భేదించు నదియు, గొప్ప గజముఖము గలదైనను పంచాస్యుని (సింహము - శివుడు) ఆదర పాత్రమును, బ్రహ్మ, యింద్రుడు మున్నగు వారిచే వెతుక దగినదియు గణేశుడను పేరు గల ఒకానొక మంగళరూపము నాకు సంపదను కలుగజేయు..........