శివమానస స్తోత్రం
శ్రీ శంకరాచార్య విరచితమ్ రత్నెః కల్పితమాసనం హిమజులై: స్నానంచ దివ్యాంబరం | నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనమ్ | జాతీచంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా |
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || 1
స్వామీ! నవరత్న ఖచిత సింహాసనము, హిమజలాలతో స్నానము, దివ్యమైన అనేక రత్నాలతో ఏర్పరుపబడిన పట్టువస్త్రము, కస్తూరికాది పరిమళ ద్రవ్యాలతో కూడిన చందనము జాజిపూలు చంపకములు బిల్వపత్రములు పుష్పాలు, అదేవిధంగా ధూపము. గోఘృతంతో తడిసిన వత్తిగల దీపము ఓ దేవా! దయానిధే! పశుపతే! ఈ అన్నియు నాహృదయంలోనే కల్పించి నీకు సమర్పించుకొనుచున్నాను. స్వీకరింపుము.
సౌవర్లే మణిఖండరత్నఖచితే పాత్రే ఘృతం పాయసం | భక్ష్యం పంచవిధం పయోదథియుతం రంభాఫలం పానకం | శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్ఞ్యలం | తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో! స్వీకురు || 2
ఓ స్వామీ! నీకై నవరత్న ఖచిత బంగారు పాత్రయందు పాయసము, చక్కని, గోఘృతము, భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య, పాయసాదులు మనస్సున కల్పించితిని. పాలు, పెరుగు, అరటిపండ్లు, పానకం, కూరలు, రుచికరమగు జలాన్నీ, పచ్చకర్పూరపు తాంబూలము మనసుతో రచించితిని. ప్రభో! భక్తితో రచించిన వీటిని స్వీకరింపుము.
ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణా భేరి మృదంగకాహళకలాగీతం చ నృత్యం తథా | సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిధా హ్యేతత్సమస్తంమయా |
3 సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ||..................