• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sri Sudharshana Mantra Sadhana

Sri Sudharshana Mantra Sadhana By Dri Jayanti Chakravarthi

₹ 60

శ్రీ సుదర్శన
 

షోడశోపచార పూజావిధానం
 

పురుషసూక్త సహిత పురాణపద్ధతి

షోడశోపచారములు అంటే 16 ఉపచారములు. అవి : 1.ధ్యానం, 2.ఆవాహనం, 3. ఆసనం, 4. పాద్యం, 5. అర్ఘ్యం, 6. ఆచమనీయం, 7. స్నానం, 8. వస్త్రం, 9. యజ్ఞోపవీతం, 10. గంధం, 11. పుష్పం, 12. ధూపం, 13. దీపం, 14. నైవేద్యం, 15. తాంబూలం, 16.నీరాజనం. ఇవి ప్రధానవమైన ఉపచారాలు. వీటితోపాటు మరికొన్ని ఉపచారాలు కూడా నిత్యషోడశోపచార పూజావిధానంలో చేరి ఉంటాయి.

ఇక్కడ పురుషసూక్త పద్ధతిలో పురాణోక్త శ్లోకాలను కూడా చేర్చి షోడశోపచార పూజావిధానాన్ని అందిస్తున్నాము. పురుషసూక్తము అనునది వేదోక్తమైనది కాబట్టి గురుముఖతః నేర్చుకున్నవారు మాత్రమే పఠించాలి. పురుషసూక్తం క్రింద ఇవ్వబడిన శ్లోకాలను అన్ని వర్ణాలవారు పఠించవచ్చు. ఈ విషయాన్ని గమనించి తమ నిత్యపూజను భక్తిశ్రద్ధలతో ఆచరించి శ్రీ స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు.

పూజా సామగ్రి :- పూజకు "రాగిగ్లాసులో నీరు, రాగి ఉద్దరిణె, రాగి పళ్ళెము, తీర్ధపాత్ర, పుష్పములు, గంధము, ఘంట, అక్షతలు, యథాశక్తిగా పంచామృతము, గోక్షీరము, నైవేద్యమునకు పటికబెల్లం, కిసిమిస్ లేక ద్రాక్షగాని, అరటిపండ్లు గాని, వండిన పదార్ధములతో మహానైవేద్యము. దీపము, ధూపము, హారతి, కర్పూరము వగైరా ముందుగా సిద్ధం చేసుకోవాలి.

తూర్పు ముఖముగా గాని, ఉత్తరముఖముగా గాని తాను కూర్చొని దైవారాధన చేయాలి. మనకు ఎదురు ముఖముగా ఆరాధ్యమూర్తి విగ్రహంగాని, చిత్రపటంగాని ఉండాలి. ప్రతి నిత్యము వీలుండేవారు శిరస్స్నానము చేసి పూజ ప్రారంభించాలి. అలా వీలులేని వారు కంఠ స్నానమైనా చేసి పూజ చేయాలి. వారివారి సంప్రదాయం ప్రకారం తిరునామమో, గోపీచందనమో, విభూతియో తిలకధారణ చేసికొని పీటమీద కూర్చుని గణపతి పూజ ప్రారంభించాలి...............

  • Title :Sri Sudharshana Mantra Sadhana
  • Author :Dri Jayanti Chakravarthi
  • Publisher :Victory Book
  • ISBN :MANIMN5811
  • Binding :Paerback
  • Published Date :2024
  • Number Of Pages :120
  • Language :Telugu
  • Availability :instock