శ్రీసూర్యపురాణము
ద్వితీయా య ము ధ్యా
సృష్టి ప క్రియ
ఓభవానీ ! శ్రద్ధతో వినుము. పూర్వము, ఆతేజోరాశియగు పరబ్రహ్మము తనపూర్వముఖమునుండి ఋగ్వేదమును, దక్షిణముఖ మునుండి యజుర్వేదమును, పశ్చిమముఖమునుండి సామవేదమును, ఉత్తరముఖమునుండి అధర్వవేదమును సృజించెను. ఈ అధర్వవేదము సర్వైతమోగుణయుక్తమై శాంతిక, మారణప్రయోగముల కుపయో గించును. ఋగ్వేదము రజోగుణప్రధానమైనది. యజుర్వేదము సల్వె గుణప్రధానమైనది. పిమ్మట ఆచతుర్ముఖుఁడు విశ్వరూపమున విజృం ఖించి, హుంకారశబ్దజేయఁగా, అధ్వనినుండి మరీచి బ్రహ్మజన్మిం చెను. ఆయనకు కశ్యపబ్రహ్మ జన్మించెను. దక్షునికి పదుమువ్వురు కన్యకలు జన్మించిరి. నా రెవ రంగా ! ఆది, 2 దితి, 3 దనువు, 4 వినత, 5 కద్రువు, 6 క్రోధ, 7రిస్టు, 855, 9 మరువు, 10 తామ, 11 శ్యేని, 12 ఇళ, 13 ప్రధ యనువారు. కశ్యపఋషి, అదితియందు దేవతలను, దితియంకు దైత్యులను, దనువునందు దానవులను, 'వినత యందు గిరుడని, అనూరుని, యక్షులను, పక్షులను, కద్రువునందు సర్పములను, గంధర్వులను, మునులను కనెను. క్రోధయనునా పెయం దు నదులును, రిష్టయందు అప్పడసలుకు, ఇరయందు ఐరావతాదిమా లింగంబులును, తామ్రయం దనేకకశ్యకలును, శ్యేనియందు డేగలు పావురములు, చిలుకలు మొదలగు పక్షులును, ఇళయందు వృక్షాదు లును, ప్రభయందు కీటాదులును జన్మించుటచే సృష్టి వెలసెను. " అని శ్రీసదాశివుఁ డానతీయఁగా ఆదిత్యుని వివాహ చరిత్రము వినలో రెద నని పార్వతి యడిగెను.............