• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sri Tirumalai Tirupati Yatra

Sri Tirumalai Tirupati Yatra By Emani Shivanagireddy

₹ 100

వందేళ్ల క్రితం తిరుమల

మార్పు సహజం! ఆ మార్పు ప్రయోజనకరమైనదైతే ఆహ్వానించదగ్గదే! అలాగాక మరోరకం ధోరణికి దగ్గరయితేనే ఆలోచించాలి.

అంటే ఉరామరిగా 20వ శతాబ్ది ప్రారంభం. వందేండ్ల క్రితం కొండమీది అడవి మధ్యలోని తిరుమల గుడి గోపురాల నిర్వహణ మహంతుల ఆజమాయిషీలోనే వుండేవి. హతీరాంబావాజీ మఠంకు చెందిన మహంతులు తిరుమల తిరుపతి దేవస్థానాల విచారణ కర్తలు, 1843 సం॥లో బ్రిటీషువారిచే నియుక్తులు. అప్పటి స్థానిక రాజులు, జమీందారులు, జియ్యంగార్డు, ఆచార్య పురుషుల్ని కాదని బ్రిటిషు వారు మహంతులకు పాలనా బాధ్యతలు కట్టబెట్టారు. వీరయితే బైరాగులు. శ్రీస్వామి కనకం ఇతర కానుకలు ఆదాయాల పైన పెద్దగా వ్యామోహం వుండదని ఇంగ్లీషు వారు అభిప్రాయపడ్డారు. అప్పుడప్పుడే ఆధునిక పోకడలు, సాంకేతికత ప్రభవిస్తున్న కాలం. దిగువ తిరుపతి వరకు రైళ్ళు, బస్సు పడ్డాయిగానీ తిరుమల కొండకు ఘాట్ రోడ్డు వేయలేదు. ఈ విషయమై తర్జనభర్జన సాగుతోంది. అప్పుడు మహంతు ప్రయాగదాసజీవారు విచారణకర్తగా వున్నారు. వారు విజ్ఞులు. అందుబాటులో వున్న వనరులతో తిరుమలను బహుముఖంగా విస్తరించడానికి కృషి చేశారు. ఆ కాలాన భక్త యాత్రీకులందరూ నడిచిగానీ, డోలీల్లోగాని తిరుమలకు వెళ్లాలి. అలిపిరి దోవ ప్రధాన నడకమార్గం. ఈ మెట్ల మార్గంలో అవసరమైన చోట మరమ్మతులు చేసి, దారీడొంకా సరిచేసి, మండపాలు నిలబెట్టి, దోపిడీ దొంగలు, క్రూరమృగాల భయంలేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. రాత్రిళ్ళు సైతం యాత్రీకులు ప్రయాణించేందుకు వీలుగా స్తంభాలు పాతించి వాషింగ్టన్ లైట్లు వేశారు. అలిపిరి దగ్గర, మామండూరు మిట్ట, ప్రస్తుతం 7వ తిరుమలై తిరుపతి యాత్ర............

  • Title :Sri Tirumalai Tirupati Yatra
  • Author :Emani Shivanagireddy
  • Publisher :Emani Shivanagireddy
  • ISBN :MANIMN5416
  • Binding :Papar Back
  • Published Date :2022
  • Number Of Pages :103
  • Language :Telugu
  • Availability :instock