• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Sri Venkatachala Mahatmyamu

Sri Venkatachala Mahatmyamu By Dr Deevi Narasimha Deekshit

₹ 270

అధ్యాయం - 1

* శ్రీ శ్వేతవరాహకల్ప వృత్తాంతం +

మునులు సూతమహర్షిని అడిగారు - "సమస్త ధర్మాలు తెలిసిన మహానుభావా! పరమాత్మ అయిన విష్ణువు స్వయంగా వెలసిన పవిత్ర స్థలాలలో ఆయనకు అత్యంత ప్రీతికరమైన క్షేత్రం ఏది ? ఎక్కడ తపస్సాధన, ధ్యానం మొదలైన వాటికి వెంటనే సిద్ధి కలుగుతుందో, ఎక్కడ శ్రీహరి మనుష్యులకు సులభంగా దర్శనమిస్తాడో అటువంటి అద్భుత చరిత్ర కలిగిన విష్ణుక్షేత్రం గురించి వినాలని కుతూహల పడుతున్నాం. వినటం చేతనే పరమానందాన్ని కలిగించేటువంటి విష్ణుక్షేత్ర గాథని వివరించండి మహర్షీ!

అది విని సూతమహర్షి క్షణకాలం ధ్యాననిమగ్నుడై తర్వాత కన్నులు తెరచి మునులతో ఇలా పలికాడు-

"మునిసత్తములారా ! మీ కుతూహలం చూస్తూంటే నాకు కూడా చెప్పాలనిపిస్తోంది. శ్రద్ధగా వినండి. క్రీడారస లోలుడైన శ్రీహరి లీలలకు నెలవైనది, అద్భుత చరిత్ర కలది. సర్వసిద్ధిప్రదం, సకలైశ్వర్యకరం, సమస్త శుభాలకు ఆకరం, పరమపవిత్రమూ అయిన శ్రీ శేషాచలానికి సంబంధించిన వరాహకల్ప వృత్తాంతం వినండి.

పూర్వం సముద్రాలన్ని ఏకమై ప్రళయం సంభవించింది. కల్పారంభంలో వటపత్రంపై పవ్వళించిన శ్రీమహావిష్ణువు కొన్ని వేలయుగాలుగా జలమయమైన విశ్వం గురించి ఆలోచించి మునుపటిలాగానే జగత్తును సృష్టించదలిచాడు. సర్వ శక్తిమంతుడు, సర్వాంతర్యామి అయిన ఆ సర్వేశ్వరుడు జగద్రచనకు పూనుకున్నాడు".. డా.దీవి నరసింహదీక్షిత్.

  • Title :Sri Venkatachala Mahatmyamu
  • Author :Dr Deevi Narasimha Deekshit
  • Publisher :V G S Book Links
  • ISBN :MANIMN4627
  • Binding :Hard binding
  • Published Date :march, 2023
  • Number Of Pages :361
  • Language :Telugu
  • Availability :instock